Movies‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెన్సార్ రివ్యూ.. క్లాప్స్‌తో యూనిట్‌ని సత్కరించిన బోర్డు సభ్యులు

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెన్సార్ రివ్యూ.. క్లాప్స్‌తో యూనిట్‌ని సత్కరించిన బోర్డు సభ్యులు

Balayya’s prestigeous 100th project Gautamiputra Satakarni has completed it’s censor formalities and gets humongous responce from board. According to the latest updates, unit has given standing ovation after watching this movie.

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్‌కి సన్నద్ధమవుతోంది. ఈమధ్యే పోస్ట్ ప్రొడక్షన్స్‌తోపాటు వీఎఫెఎక్స్ పనుల్ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని యూనిట్‌ని చప్పట్లతో సత్కరించారు.

కేవలం 8 నెలలో సమయంలో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్‌ని బోర్ మెంబర్స్ ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే.. బాలయ్య తననితాను పూర్తిగా ‘శాతకర్ణి’ గెటప్‌లో మార్చుకున్న విధానం, చూపించిన నట విశ్వరూపానికి ఫిదా అయి.. హ్యాట్సాఫ్ చెప్పారట. ఈ చిత్రం విజువల్ ట్రీట్‌లా ఉందని.. గ్రాఫిక్స్ అదిరిపోయే రేంజులో ఉందని, హాలీవుడ్‌ని తలపించే విధంగా ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని సెన్సార్ టాక్. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో క్రిష్ చెప్పినట్లుగానే ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవడంతోపాటు తెలుగు ప్రజలు గర్వించదగేలా ఉందని సెన్సార్ కితాబిచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని చూసేందుకు కూడా సెన్సార్ సభ్యులు ఎగబడ్డారట.

బాలయ్య ల్యాండ్‌మార్క్ 100వ మూవీ కావడం, హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కడం, అలాగే చాలాకాలం తర్వాత తన మైల్‌స్టోన్ 150 మూవీతో రీఎంట్రీ ఇస్తున్న చిరుతో తలపడుతుండడంతో.. ‘శాతకర్ణి’ ఎలా ఉంటుందా? అని చూసేందుకు బోర్డులో సెన్సార్ సభ్యులు నానాహంగామా చేశారని తెలుస్తోంది. చివరికి సినిమా చూశాక.. కళ్లుచెదిరే రేంజులో ఉండడంతో పొగడ్తలతో ముంచెత్తారని చెబుతున్నారు. అటు ‘ఖైదీ’కి ఈ రేంజులోనే రెస్పాన్స్ రావడంతో.. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద భీకరమైన పోరు తప్పదని చెప్పుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news