Balayya’s prestigious project Gautamiputra Satakarni 4 days worldwide gross collections report is out and it is record figure for Balayya.
బాలయ్య ప్రెస్టీజియస్ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్లో బాక్సాఫీస్‌ని ఉతికి ఆరేసింది. మొదటినుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతోపాటు రిలీజ్ అయ్యాక అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో.. బాలయ్య మార్కెట్ వ్యాల్యూ కంటే ఎక్కువ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. దీంతో.. నాలుగు రోజుల్లో ఆయన కెరీర్లో ఏ ఒక్క చిత్రం వసూలు చేయని రికార్డ్ కలెక్షన్స్‌ని ‘శాతకర్ణి’ సాధించింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘శాతకర్ణి’ సినిమా మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 46.55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.30.8 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఏపీ, తెలంగాణాల్లో ఈ చిత్రానికి ప్రభుత్వాలు ట్యాక్స్ ఎక్సెంప్షన్ చేశాయి కాబట్టి.. గ్రాస్ కూడా షేర్ కిందకే చేరుతుంది. అంటే.. ఇప్పటివరకు అందిన గ్రాస్ లెక్క నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఖాతాలోకే వెళుతుందన్నమాట.
ఏరియాల వారీగా 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ (కోట్లలో) :
ఆంధ్రా : 16.8
నైజాం : 7.8
సీడెడ్ : 6.2
ఏపీ+నైజాం : రూ.30.8 కోట్లు
యూఎస్ఏ : 8.45
కర్ణాటక : 4.60
రెస్టాఫ్ ఇండియా+వరల్డ్ : 2.70
టోటల్ వరల్డ్ వైడ్ : రూ.46.55 కోట్లు (గ్రాస్)