Balayya’s 100th film gautamiputra satakarni 4 days worldwide collections report is out. This movie has earning well not only in Telugu states but also in Overseas and Karnataka.
నందమూరి నటసింహం బాలయ్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా.. మాస్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే.. ఆయన చిత్రాలు మంచి వసూళ్లు సాధించి, డిస్ట్రిబ్యూటర్లను సంతృప్తి పరుస్తాయి. కానీ.. ఇతర ఏరియాల్లో బాలయ్యకు అంతగా మార్కెట్ లేదు. ఒకే తరహా మాస్ సినిమాలు చేస్తూ వస్తుండడంతో.. అటు ఓవర్సీస్లో, ఇటు కర్ణాటకలో ఆయన సినిమాలు అంతంత మాత్రమే వసూళ్లు తెచ్చిపెట్టాయి. మిగతా హీరోలు లోకల్లోనే కాకుండా ఇతర ఏరియాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తుంటే.. బాలయ్య మాత్రం తన సత్తా చాటుకోలేకపోయాడు. అయితే.. ఆయన ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఇప్పుడు ఆ లోటును కూడా తీర్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్తోపాటు కర్ణాటకలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం నాలుగు రోజుల్లో రూ.25.93 కోట్లు కొల్లగొట్టిన ‘శాతకర్ణి’ సినిమా… ఓవర్సీస్లో రూ.4.10 కోట్లు, కర్ణాటకలో రూ.2.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా నుంచి 0.50 కోట్లు షేర్ రాబట్టినట్లు తెలిసింది. ఈ లెక్కలన్నీ కలుపుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ‘శాతకర్ణి’ సినిమా నాలుగు రోజుల్లో రూ.32.78 కోట్లు సాధించిందన్నమాట. ఇది బాలయ్య కెరీర్లోనే రికార్డ్ ఫిగర్. ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ మొత్తం ఏ ఒక్క సినిమా బాలయ్య కెరీర్లో కలెక్ట్ చేయలేదు. క్రీ.శ.1-2 మధ్య కాలానికి చెందిన శాతవాహనుల చక్రవర్తి ‘శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చారిత్రాత్మక సినిమాకి అన్నివైపుల నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఈ రేంజులో ఈ చిత్రం వసూళ్లు రాబడుతుండడాన్ని చూసి.. డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏరియాల వారీగా శాతకర్ణి 4 రోజుల కలెక్షన్స్ వివరాలు (కోట్లలో) :
నైజాం : 6.98
సీడెడ్ : 5.37
గుంటూరు : 3.07
ఉత్తరాంధ్ర : 2.66
వెస్ట్ గోదావరి : 2.42
ఈస్ట్ గోదావరి : 2.15
కృష్ణా : 2.03
నెల్లూరు : 1.24
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 25.93 కోట్లు
కర్ణాటక : 2.25
రెస్టాఫ్ ఇండియా : 0.50
ఓవర్సీస్ : 4.10
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 32.78 కోట్లు (షేర్)