Newsఅతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల...

అతడికి 13.. ఆమెకు 25.. ఆ పని చేసినందుకు టీచర్‌కి పదేళ్ల జైలు శిక్ష

A middle school teacher Alexandria Vera who pleaded guilty to having a long-term sexual relationship with a 13-year-old boy was sentenced to 10 years in prison.

ఆమె ఒక టీచర్.. ఎంతో తెలివి, క్రమశిక్షణ ఉంటేగానీ ఆ స్థాయికి చేరుకోదు. అలాంటి ఆమె.. కనీస ఇంగితజ్ఞానం లేకుండా ఎవరూ చేయకూడని ఓ పాడుపని చేసింది. వయసులో తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన ఓ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అతనితో ఎప్పుడుపడితే అప్పుడు తన కామకోరికలు తీర్చుకునేది. ఓసారి గర్భవతి అయ్యింది కూడా. అయితే.. ఇలా ఓ బాలుడితో సంబంధం పెట్టుకోవడం నేరం కాబట్టి, ఆమెని కోర్టు ముందు హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో.. ఆమెకి పదేళ్ల శిక్ష ఖరారు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హ్యూస్టన్‌లోని ఓ మిడిల్‌స్కూల్‌‌లో 25 ఏళ్ల అలెగ్జాండ్రియా టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈమెను 13 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిందన్న ఆరోపణలతో పోలీసులు ఈమధ్యే అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టగా.. ఆమె నేరం చేసినట్లు రుజువు అయ్యింది. దీంతో.. హ్యూస్టన్‌లోని 209వ డిస్ట్రిక్ట్‌ కోర్టు ఆమెకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. నిజానికి.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ.. వీరాకి మాత్రం పదేళ్ల మాత్రమే శిక్ష పడింది.

అయితే వీరా మాత్రం తానేమీ ఆ బాలుడ్ని లైంగికంగా వేధించలేదని.. ఆ బాలుడు, తాను ప్రేమించుకున్నామని తెలిపింది. తమకు ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమైందని, కొన్నాళ్ల తర్వాత తమ స్నేహం ప్రేమగా మారిందని పేర్కొంది. అతని వల్ల తాను ఒకసారి గర్భవతిని కూడా అయ్యానని, అబార్షన్‌ చేయించుకున్నానని చెప్పింది. పాఠశాల ప్రిన్సిపల్‌కు వీరి గురించి సమాచారం తెలియడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. బాలుడి తల్లిదండ్రులు ఆ టీచరమ్మపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.

వీరి లైంగిక సంబంధం 9నెలల పాటు కొనసాగిందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వీరాకు అంతకుముందే ఆరేళ్ల కూతురు కూడా ఉందని, ఆ అమ్మాయి ఈ కుర్రాడిని ‘డాడీ‌’ అని పిలిచేదని కూడా చెప్పారు. వీరా బాలుడి కుటుంబంతో సన్నిహితంగా ఉండేదని, ఆర్థికంగా సాయం కూడా చేసేదని తెలిపారు. వీరాను జైలుకు పంపించడం వల్ల సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలనుకుంటున్నామని న్యాయమూర్తి తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చెయ్యాలని కోరుకుంటున్నామని, ఇలాంటివి జరగకూడదని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news