Director VV Vinayak reveales some interesting topics about Khaidi No 150 movie whic is going to be release on January 11th.
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన కొత్తలో.. ఏ దర్శకుడితో ఆయన సినిమా చేస్తాడా? అని సందేహాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఎందరో దర్శకుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకానొక సమయంలో పూరీ జగన్నాథ్ ఫిక్స్ అవుతాడని అనుకున్నారు కానీ.. సడెన్‌గా సీన్‌లోకి వినాయక్ రావడం, అతడే చిరు ప్రతిష్టాత్మక 150 చిత్రానికి డైరెక్టర్‌గా ఫిక్స్ అవ్వడం అంతా జరిగిపోయింది. ఈ ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన వినాయక్.. ఆనాటి విశేషాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వినాయక్ మాట్లాడుతూ.. ‘ఒక రోజు అన్నయ్య (చిరు) నాకు ఫోన్ చేసి.. ‘వినయ్ ఓసారి ఇంటికి రా’ అని పిలిచారు. నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లాక ‘నువ్వు కత్తి సినిమా చూశావా’ అని ప్రశ్నించారు. మామూలుగా చూశాను కానీ, అంత పరిశీలనగా చూడదలేదని సమాధానం ఇచ్చా. ‘ఒకసారి నన్ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చూడు.. ఆ తర్వాత నీ అభిప్రాయం ఏంటో చెప్పు’ అని అన్నారు. దాంతో.. ఆ చిత్రాన్ని నేను పదేపదే చూశా. అలా పదిరోజులపాటు నోట్స్ రాసుకుంటూ ఆ మూవీని చూశాక.. అందులో కామెడీతోపాటు పాటలు కూడా బాగుండాలని అనుకుని.. ఆ ప్రకారంగా స్ర్కిప్ట్ రాసుకుని వెళ్ళి అన్నయ్యకి వివరించాను. ఈ సినిమా అయితే మీకు ఫెంటాస్టిక్‌గా ఉంటుందని చెప్పడంతోపాటు.. నేను రాసుకున్న నోట్స్ ఆయనకు వివరించాను. అవి విని చిరు చాలా ఇంప్రెస్ అయ్యి.. ఓకే అన్నారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి.. మేము అనుకున్న స్క్రిప్ట్‌ను ఒక ఆర్డర్‌లో సెట్ చేశాం. అలా రెడీ చేసిన స్ర్కిప్ట్‌ని తీసుకెళ్లి.. ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా నెరేట్ చేశాను. అది విన్న చిరు వెంటనే లేచి నన్ను హగ్ చేసుకున్నారు. చాలా బాగుందని చెప్పారు’.
‘అది జరిగిన రెండు, మూడురోజుల తర్వాత తనకు బ్రహ్మానందం కావాలని చిరు అడిగారు. అప్పుడు ఆయన పాత్రని ఇందులో ఎలా ఇరికించాలా? అని ఆలోచిస్తుండగా… ‘బ్రహ్మీ నన్ను అవమానించేలా, నేను అతడ్ని ఇరికించేలా ఏదైనా వస్తే చూడు’ అని చిరునే సూచించారు. అప్పుడు ఒక ట్రాక్‌ని పక్కనపెట్టేసి.. బ్రహ్మానందం క్యారెక్టర్‌ని సృష్టించాం. అంతకంటే ముందు ఇందులో అనుష్క, కాజల్‌లను హీరోయిన్లుగా తీసుకోవాలని అనుకున్నాను. కానీ.. బ్రహ్మానందం క్యారెక్టర్‌ని ఇరికించాక.. సింగిల్ హీరోయిన్ అయింది. ఇక ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరినో ఒకరిని తీసుకుందామనుకుంటే.. చివరికి కాజల్ ఫిక్స్ అయ్యింది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్‌ను కూడా సజెస్ట్ చేశారు కానీ, నేను వద్దన్నాను. అయితే కాజల్.. లేదంటే అనుష్క అని ఫిక్సయ్యా. ఫైనల్‌గా కాజల్ ఓకే అయింది’ అని వినాయక్ చెప్పుకొచ్చారు.