Megastar Chiranjeevi’s 150th film 4th day area wise world wide collections report is out. According to the trade reports, khaidi number 150 joined into 60 crore club on 4th day of its run.
మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’ ద్వారా మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ‘ఖైదీ నెం.150’.. భారీ వసూళ్లతో ముందుకు దూసుకెళుతున్నాడు. ఇప్పటికే మూడురోజుల్లో బాక్సాఫీస్‌ని ఉతికి ఆరేసిన చిరు.. నాలుగోరోజు కూడా పిండేశాడు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిమూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 37.34 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఖైదీ’.. నాలుగోరోజు (శనివారం) రూ.7.46 కోట్లు కొల్లగొట్టింది. అంటే.. మొత్తం నాలుగురోజుల్లో ఈ సినిమా కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ. 44.80 కోట్లు (షేర్) రాబట్టింది. చాలాకాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు క్రేజ్ వల్లే ఈ చిత్రం టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా వసూళ్ల వర్షం కురిపిస్తోందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. రూ.8.5 కోట్లు మేర కర్ణాటకలో బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ రాష్ట్రం నుంచి నాలుగు రోజుల్లో రూ.6.35 కోట్లు సాధించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్‌కి చేరిపోతుందని స్పష్టమవుతోంది. ఇన్నే్ళ్ల తర్వాత కూడా చిరు క్రేజ్ ఏమాత్రం తగ్గకలేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి..?
ఏరియాల వారీగా 4 రోజుల కలెక్షన్ల వివరాలు (కోట్లలో):
నైజాం : 13.33
సీడెడ్ : 7.33
నెల్లూరు : 1.77
కృష్ణా : 2.83
గుంటూరు : 4.13
వైజాగ్ : 6.78
ఈస్ట్ గోదావరి : 4.81
వెస్ట్ గోదావరి : 3.82
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 44.80 కోట్లు (షేర్)
కర్ణాటక : 6.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.20 కోట్లు
ఓవర్ సీస్: 10.70 కోట్లు
మొత్తం కలెక్షన్లు: 62.74 కోట్లు