Newsప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి

ప్రేమాలేదు.. దోమాలేదు.. అంతా డబ్బుకోసమే : చిరంజీవి

Chiranjeevi makes some funny comments on Ram Charan and his wife Surekha in Sankranti special interview.

సంక్రాంతి కానుకగా తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం విడుదలైన సందర్భంగా.. చిరంజీవి ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇచ్చారు. నిహారిక హోస్ట్‌గా వ్యవహరించిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్, వివి వినాయక్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు, వ్యక్తిగత వ్యవహారాలతోపాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే చిరు సరదాగా చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘నా ఫిట్‌నెస్ విషయంలో సురేఖ, చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సురేఖ ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటే.. చరణ్ ఓ ట్రైనర్‌ని పెట్టి వ్యాయామాలు, బరువు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ విధంగా వారిద్దరూ నా ఫిట్‌నెస్ విషయంలో తీసుకుంటున్న కేర్ తీసుకుని, నాపై ఎంత ప్రేముందోనని అనుకునేవాడిని. కానీ.. ఆ తర్వాత ఇది ప్రేమాదోమా కాదని తెలిసింది. ఒకరేమో (సురేఖ) సినిమా ప్రెజెంటర్, మరొకరు (చరణ్) నిర్మాత. హీరో బాగుంటేనే కదా నాలుగు డబ్బులు వస్తాయి. ఆ డబ్బుపై ఉన్న మమకారంతో ఫిట్‌నెస్ పేరుతో వాళ్లిద్దరూ నన్ను నానా హింసలు పెట్టారు’ అంటూ చిరంజీవి సరదాగా చెప్పుకొచ్చారు.

చిరు అలా అనగానే.. వినాయక్ వెంటనే కలగజేసుకున్నాడు. ‘మీరలా అనుకోవద్దు.. చరణ్‌కు నిజంగా మీ మీద చాలా ప్రేముంది.. సెట్స్‌లో లేని ప్రతిసారి నాకు ఫోన్ చేసి, మీ బాగోగులు కనుక్కుంటాడు’ చెప్పాడు. ఏదేమైనా.. ఈ సరదా సంభాషణ మాత్రం ఇంటర్వ్యూలోకెల్లా హైలైట్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news