Movies17 రోజుల్లో 100 కోట్ల షేర్ క్రాస్ చేసిన ‘ఖైదీ’.. మెగాస్టామినాకి...

17 రోజుల్లో 100 కోట్ల షేర్ క్రాస్ చేసిన ‘ఖైదీ’.. మెగాస్టామినాకి రికార్డులు దాసోహం

Megastar Chiranjeevi’s prestigious 150th project Khaidi No 150 collects 100cr share at the worldwide boxoffice in just 17 days. This is the second film to achieve this feat after Baahubali.

‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ మార్కెట్‌ని ఒక్కసారిగా విస్తృతంగా పెంచేసింది. తొలిసారి రూ.100 కోట్ల షేర్ కలెక్ట్ చేసి.. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా తెలియజేసింది. దీంతో.. ఆ మూవీ తర్వాత వచ్చే స్టార్ హీరోల సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరుతాయని భావించారు. కానీ.. ఇంతవరకు ఏ ఒక్క సినిమా ఆ ఫీట్ అందుకోలేకపోయింది. చివరగా ‘శ్రీమంతుడు’ సినిమానే రూ.86 కోట్లకుపైగా వసూళ్లతో రెండో స్థానం కైవసం చేసుకుంది. దీంతో.. వందోకోట్ల మార్క్‌ని అందుకోవడం కష్టమేనని అనుకుంటున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సునామీలా దూసుకొచ్చాడు. తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం ద్వారా ప్రస్తుత స్టార్ హీరోలకు సాధ్యం కాని ఆ రేర్ ఫీట్‌ని కేవలం 17 రోజులకే అందుకున్నాడు.

అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఖైదీ నెం.150’ సినిమా.. తొలిరోజే రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత రోజుల్లో కూడా అనూహ్య కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అంతటితో ఆగలేదు.. వీక్ డేస్‌లలో కూడా ఓ ఊపు ఊపేసింది. ఓవైపు ‘శాతకర్ణి’, ‘శతమానం భవతి’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నా.. అవి ‘ఖైదీ’ దూకుడుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అటు వీకెండ్స్, ఇటు వీక్ డేస్‌లో ‘ఖైదీ’ చిత్రం బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకుంది. దీంతో.. 17 రోజుల్లోనే ఆ మూవీ రూ.100 కోట్లు షేర్ కలెక్ట్ దాటేసింది. ఈ దెబ్బకు గత సినిమాల రికార్డులన్నీ మెగాస్టార్ స్టామినా ముందు కొట్టుకుపోయాయి. ‘బాహుబలి’ తర్వాత ఆ ఫీట్‌ని అందుకున్న రెండో చిత్రంగా ‘ఖైదీ’ నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news