Megastar Chiranjeevi’s 16 days worldwide collections report is out. According to trade, this movie has earned massive amount in 15, 16 days.
ఏ స్టార్ హీరో సినిమా అయినా.. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. తొలి 10 రోజుల వరకే అది బాక్సాఫీస్‌ని ఓ ఊపు ఊపేస్తుంది. ఆ తర్వాత ఆ సినిమా క్రేజ్ తగ్గిపోతుంది కాబట్టి.. సహజంగానే వసూళ్లు అనూహ్యంగా డ్రాప్ అవుతాయి. కొద్దోగొప్పో కలెక్షన్లతోనే ఆ చిత్రం నెట్టుకువస్తుంది. ఇది ఇప్పటికే ఎన్నోసార్లు రుజువయ్యింది కూడా. కానీ.. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మాత్రం ఆ సూత్రాన్ని నామరూపాలు లేకుండా చెరిపేసింది. రెండు వారాల్లో బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత కూడా ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. 15, 16 రోజులలో ఈ చిత్రం వసూళ్లు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.67 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండో రోజుల్లో రూ. 3.39 కోట్లు (షేర్) కొల్లగొట్టింది. ఓవైపు ‘శాతకర్ణి, శతమానం భవతి’ సినిమాలు.. మరోవైపు ‘రయీస్, కాబిల్’ చిత్రాలు.. ఆ నాలుగు పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అంత భారీ పోటీలోనూ ఖైదీ చిత్రం రెండురోజుల్లో అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా చెప్పుకోదగిన విషయమే. దీంతో.. మొత్తం 16 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 98.06 కోట్లు సాధించిందన్నమాట. పదేళ్లు గ్యాప్ ఇచ్చినా.. చిరు స్టామినా ఏమాత్రం తగ్గిపోలేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి.
ఏరియాల వారీగా 16 రోజుల కలెక్షన్ల వివరాలు :
నైజాం : 18.60
సీడెడ్ : 14.04
నెల్లూరు : 3.15
గుంటూరు : 6.76
కృష్ణా : 5.32
వెస్ట్ గోదావరి : 5.72
ఈస్ట్ గోదావరి : 7.65
ఉత్తరాంధ్ర : 11.98
ఏపీ+తెలంగాణ : రూ. 73.22 కోట్లు
ఓవర్సీస్ : 13.94
కర్ణాటక : 9
రెస్టాఫ్ ఇండియా : 1.90
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 98.06 కోట్లు