Newsత్రిష మాజీ ప్రియుడితో తెలుగు హీరోయిన్ ఎఫైర్..!

త్రిష మాజీ ప్రియుడితో తెలుగు హీరోయిన్ ఎఫైర్..!

Telugu beauty Bindu Madhavi is in affair with Trisha’s ex boyfriend Varun Manian. Recently they went foreign tour and their photos going viral on internet.

చెన్నై బ్యూటీ త్రిషతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్న వరుణ్ మణియన్ గుర్తున్నాడా..? ప్రముఖ వ్యాపారవేత్త, కోలీవుడ్‌లో నిర్మాత కూడా అయిన వరుణ్ గురించి గతంలో ఎవరికీ తెలీదు. కానీ.. త్రిషతో లవ్ ఎఫైర్ పుణ్యమా అని అతడు బాగా ఫేమస్ అయిపోయాడు. కానీ.. త్రిషతో పెళ్లి రద్దయ్యాక మళ్ళీ కనిపించకుండా పోయాడు. ఇప్పుడతడు మళ్ళీ అనుకోకుండా వార్తల్లోకి వచ్చాడు. ఈసారి మరో హీరోయిన్‌తో ఎఫైర్ మొదలుపెట్టాడు. ఆమె మరెవ్వరో కాదు.. కోలీవుడ్‌లో సెటిలైన బిందు మాధవి.

గతకొన్నాళ్ల నుంచి బిందు, వరుణ్ చెట్టాపట్టాలేసుకుని తెగ తిరుగుతున్నారు. ప్రైవేట్ పార్టీలకే కాదు.. షికార్లకు కూడా వెళుతున్నారు. ఈమధ్యే ఫారిన్ టూర్‌కి వెళ్లిన వీరిద్దరూ.. కొన్ని ఫోటోలు దిగారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్లో వారిమధ్య ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. పైగా.. స్వయంగా ఆ ఫోటోలని వీరే సోషల్ మీడియాలో అప్‌లోట్ చేయడంతో, వీరి ఎఫైర్ నిజమేనన్న అనుమానం మరింత బలపడింది. తమిళ సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా వీరి గురించి చర్చలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బిందు మాధవికి హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలేమీ లేవు. ఇటు తెలుగు, అటు తమిళంలో చాలాకాలమే ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేసింది. కానీ.. ఏమాత్రం ప్రయోజనం దక్కలేదు. అందుకే.. ఇక లైఫ్‌లో సెటిలైపోదామనే ఉద్దేశంతో వరుణ్‌తో లవ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరి బంధం ఎటువైపు సాగుతుందో చూద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news