Balayya’s 100th Gautamiputra Satakarni 8 days worldwide collections report is out.
జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా బాక్సాఫీస్‌ని గడగడలాడిస్తుంది. బరిలో వున్న మరో రెండు సినిమాలకు ధీటుగా పోటీనిస్తూ.. ఊహించని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ చారిత్రాత్మక సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరి.. వరల్డ్‌వైడ్‌గా బాలకృష్ణ సత్తా ఏంటో చాటిచెప్పింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లో రూ. 50.26 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.35.81 కోట్లు కొల్లగొట్టింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రావడం.. మొదటిసారిగా 50 కోట్ల క్లబ్ లో చేరడం బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్. ‘ఖైదీ నెం.150’, ‘శతమానం భవతి’ సినిమాల పోటీమధ్య కూడా ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లతో దూసుకెళ్లడం నిజంగా విశేషం.డైరెక్టర్ క్రిష్ ఖాతాలో కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం.
ఏరియాల వారీగా ఎనిమిది రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 9.15
సీడెడ్ : 7.59
వైజాగ్ : 4.75
గుంటూరు : 3.76
వెస్ట్ గోదావరి : 3.11
ఈస్ట్ గోదావరి : 3.18
కృష్ణా : 2.62
నెల్లూరు : 1.65
ఏపీ+తెలంగాణ : రూ. 35.81 కోట్లు
ఓవర్సీస్ : 9.00
కర్ణాటక : 4.25
రెస్టాఫ్ ఇండియా : 1.20
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 50.26 కోట్లు