ఈ దశాబ్ధపు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు వారందరూ గర్వించదగ్గ డైరెక్టర్స్ ఎంతమంది తెరపైకి వచ్చారంటే చెప్పే పేర్లలో కచ్చితంగా జాగర్లమూడి క్రిష్ పేరు ఉంటుంది. గమ్యం సినిమాతోనే తానంటే ఏంటో ప్రూవ్ చేసుకున్న క్రిష్…కంచె సినిమాతో తన స్థాయిని చాలా చాలా పెంచుకున్నాడు. ఇప్పుడిక ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఐడియాతోనే చాలా మంది తెలుగు వాళ్ళ దృష్టిలో హీరో అయిపోయాడు క్రిష్. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన శాతకర్ణి ట్రైలర్ అయితే బాహుబలి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళిని కూడా మెస్మరైజ్ చేసేసింది. మరి ఇప్పుడు సినిమా కూడా అదే రేంజ్లో ఉందా? ఎడిటింగ్ టేబుల్ పై నుంచి వచ్చిన జన్యూన్ సమాచారంతో ఈ రివ్యూ మీ కోసం……
ముందుగా ప్రేక్షకులందరికీ చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణి మరణం గురించి టాపిక్ ఉండదు. అలాగే మెలో డ్రామాను నమ్ముకుని క్రిష్ ఈ సినిమా చేయలేదు. కేవలం గౌతమీ పుత్రుడి వీరగాథను మాత్రమే మనకు చెప్తున్నాడు. సినిమా అంతా కూడా యుద్ధ వాతావరణమే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి శాతకర్ణితో భార్యకు కూడా విభేదాలు వస్తాయి. అస్తమానూ యుద్ధాలంటూ పోరులో తలపడుతూ ఉండే భర్తను భార్య కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతుంది. కానీ శాతకర్ణి తల్లికి మాత్రం కొడుకు చేసే ప్రతి పనిపై పూర్తి అవగాహన ఉంటుంది. శాతకర్ణి లాంటి కొడుకును కన్నందుకు ఆమె గర్వపడుతూ ఉంటుంది.అయితే ఒకానొక సమయంలో తల్లి కూడా శాతకర్ణి చేస్తున్న యుద్ధాలను ఆపే ప్రయత్నాలు చేస్తుంది కానీ శాతకర్ణి యుద్ధాలు చేస్తూ భారతాన్ని మొత్తాన్ని ఒకే తాటిపైకి ఎలా తీసుకురాగలిగాడు? ఒక తెలుగువాడు మొత్తం దేశానికి చేసిన సేవ ఏంటి అనేదే ఈ సినిమా. దేశం మొత్తం మీసం తిప్పేలా శాతకర్ణి వీరగాథను తెరకెక్కించాడు క్రిష్.
కంచె సినిమా నచ్చినవాళ్ళందరికీ ఈ సినిమా అంతకంటే బాగా నచ్చుతుంది. బాలకృష్ణ ఆవేశం, వీరోచిత అభినయం అభిమానులను మునివేళ్ళపైన నిలబెడుతుంది. బాలకృష్ణతో పాటు హేమమాలిని యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ కాలమే అయినప్పటికీ గ్రాఫిక్స్ కూడా బాగానే ఉంటాయని చెప్తున్నారు. ముందుగా అనుకున్న దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవడంతో రంగంలోకి వచ్చిన చిరంతన భట్ మ్యూజిక్ మాత్రం శాతకర్ణికి మేజర్ ప్లస్ అయిందని చెప్తున్నారు. ఓవరాల్గా క్రిష్ మార్క్ యాక్షన్, ఎమోషనల్, హిస్టారికల్ ఎంటర్టైనర్గా శాతకర్ణిని చూడొచ్చని చూసినవాళ్ళు చెప్తున్నారు.
బాలయ్య అంటేనే డైలాగులు.. డైలాగులు అంటేనే బాలయ్య అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే… శాతకర్ణి లోని కొన్ని డైలాగులు మీకోసం…
1) మా జైత్రయాత్రని గౌరవించి..మా ఏలుబడిని అంగీకరించి.. మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాదీనం చేసి.. మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..
2) మీరు కడుపున మోసింది మనిషిని కాదు.. మారణహోమాన్ని.. మహాయుద్దాన్ని
3) ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం.. ఇక ఉనికి చాటుకుందాం.. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తురితో ప్రక్షాలన చేద్దాం.. దొరికిన వాన్ని తురుముదాం.. దొరకని వాన్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం
4) నా బిడ్డ కోసమో.. నీ గడ్డ కోసమో.. కాదు నేను పోరాడుతున్నది.. ఈ దేశం అంతటిని ఏక ఖండంగా కలపడానికి
5) అవును నాకు ఆ గర్వం కావాలి.. ఆ సేతు శీతాచలం ఈ మహాభారత దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుండే గర్వం కావాలి నాకు..
అలా చూడటానికి వాళ్ళందరిని కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు
6) భారతదేశం ఉమ్మడి కుటుంబం.. గదికి గదికి మద్యన గోడలుంటాయి..ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం.. కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే.. ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం.. మీ మొండేలమీద మా జెండాలెగరెస్తాం