Baahubali: The Conclusion has done humongous business in Andhra and Telangana state which is said to be historical record.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా అప్పట్లో ఏ రేంజులో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు ఇండియన్ బాక్సాఫీస్‌ని ఉతికి ఆరేసింది. దాంతో.. రెండో భాగంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న కూడా ఈ చిత్రానికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ కారణంగానే.. ఈ సినిమా ఊహించని రేంజులో బిజినెస్ చేసింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 130 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు చిత్రం కేవలం ఏపీ, తెలంగాణాల్లో ఈ రేంజులో బిజినెస్ చేయలేదు. ఈ మూవీ దెబ్బకు గత రికార్డులన్నీ బద్దలైపోయాయి. కేవలం నైజాంలోనే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.47.5 కోట్లకు పలకడం నిజంగా సంచలనం. ఇక మిగిలిన ఏరియాల్లోనూ ఈ చిత్రం రైట్స్ కళ్లుచెదిరే రేట్లకు అమ్ముడుపోయాయి. గతంలో ‘బాహుబలి’ మొదటి భాగం రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.66.20 కోట్ల బిజినెస్ చేయగా.. రెండోభాగం దానికి రెండింతలు చేసింది. దీన్ని బట్టి.. ‘బాహుబలి-2’పై ఏ రేంజులో అంచనాలు నెలకొన్నాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. ఇది రూ.1000 కోట్లు కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..
నైజాం : 47.5
సీడెడ్ : 25
ఉత్తరాంధ్ర + కృష్ణా : 23
గుంటూరు : 11.5
ఈస్ట్ + వెస్ట్ : 17.50
నెల్లూరు : 5.50
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 130 కోట్లు