Anchor Anasuya Bharadwaj taking huge remuneration for one hour to regular shows which is very high among the all telugu anchors. This is show how she has craze.
ప్రస్తుతం యాంకర్ అనసూయ క్రేజ్ ఏ రేంజులో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్‌గా తన కెరీర్ ఎప్పుడు ప్రారంభించిందో పక్కాగా తెలీదు కానీ.. ‘జబర్దస్త్’ పుణ్యమా అని ఆమె కెరీర్ అనూహ్య మలుపు తిరిగింది. ఆ షోలో చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని హాట్ అందాలు ఆరబోయడంతోపాటు ముద్దుముద్దు మాటలతో ఆకట్టుకుంది. దాంతో.. ఆమెకు బోలెడన్నీ ఆఫర్స్ వచ్చేశాయి. సినిమాల్లోనూ కీలకపాత్రలు పోషించే ఛాన్సులు ఆమెకు వరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు.. ఆమె కోసమే ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా క్రియేట్ చేశారు. ఆ రేంజులో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. అలాంటి ఈ భామ తన రేటు పెంచకుండా ఉంటుందా? ఒక్కసారిగా అమాంతం పెంచేసింది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రెగ్యులర్‌గా చేస్తున్న కార్యక్రమాలకు గంటకి రూ.40 వేలు తీసుకుంటోంది. ప్రస్తుతం యాంకర్లు తీసుకుంటున్న పారితోషికంతో పోల్చుకుంటే.. ఇది చాలా ఎక్కువ. కొన్నాళ్ల తర్వాత అది రూ.50 వేలకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. ఆ అమ్మడు ఫుల్ డిమాండ్‌లో ఉంది కాబట్టి, షో నిర్వాహకులు ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఇక ప్రైవేట్ ఈవెంట్లకైతే ఈ భామ లక్షల్లో డిమాండ్ చేస్తోందట. అలాగే.. సినిమాల్లో చేసే పాత్రలకు సైతం రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా అడుగుతోందట. చూస్తుంటే.. స్టార్ రేంజ్ స్టార్లకు తగ్గట్టుగానే అనసూయ తన బ్యాంకు ఖాతాలో భారీగానే జమ చేసుకుంటోందన్నమాట.