తెలుగులో టాప్ రేంజ్‌లో బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టిన సినిమాల్లో ఎక్కువ శాతం మాస్ మసాలా, కమర్షియల్ సినిమాలే ఉంటాయి. ఒక తెలుగు అనే కాదు ఇండియాలో ఉన్న అన్ని భాషల్లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి. కానీ ఒక్క బాలీవుడ్ మాత్రం దీనికి మినహాయింపు. బాలీవుడ్‌లో ఉన్న మిగతా స్టార్ హీరోల సినిమాలు కూడా సేం టు సేం తెలుగు హీరోల బాపతే. కానీ ఒకే ఒక్కడు అమీర్ ఖాన్ మాత్రం దీనికి మినహాయింపు. ఇప్పుడు అదే అమీర్ ఖాన్ మరోసారి ….మరొ కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. కేవలం 13రోజుల్లో దంగల్ సినిమాతో 300కోట్లు కొల్లగొట్టాడు.
బాలీవుడ్ చరిత్రలో 300 కోట్ల క్లబ్‌లో చేరిన నాలుగో చిత్రంగా దంగల్ నిలిచింది. ఇప్పటి వరకూ సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’, ‘బజ్‌రంగి భాయ్‌జాన్’, అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమాలు ఈ టాప్ క్లబ్‌లో ఉన్నాయి. ‘దంగల్’ రికార్డు కలెక్షన్లను ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు తరన్ ఆదర్శ్ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. 2వ రోజు రూ.50 కోట్లకు చేరుకున్న ఈ చిత్రం కలెక్షన్లు, మూడో రోజుకు రూ.100 కోట్లు, 5వ రోజుకు ‘150’ కోట్లు, 8వ రోజుకు రూ.200 కోట్లు, 10వ రోజుకు రూ.250 కోట్లుకు చేరుకున్నాయి. 13వ రోజు పూర్తయ్యే సరికి సినిమా రూ.300 కోట్లు వసూలయ్యాయి. అమీర్ నటించిన ‘పీకే’ చిత్రం 17 రోజుల్లో ఈ రికార్డు సాధించింది. కలెక్షన్స్ కంటే కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలతో ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్న అమీర్ ఖాన్‌ని చూసి సినిమా ప్రేక్షకులతో పాటు తోటి స్టార్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.