Vijay Antony starrer Bethaludu has earned less amount than expected in it’s first week run because of bad reports from all over the world. According to the latest report, this time distributors have to face huge loss.
విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం.. తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసింది. రూ.16 కోట్లకుపైగా షేర్స్‌తో డిస్ట్రిబ్యూటర్లను భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అంతేకాదు.. 50 రోజుల పోస్టర్ కార్డ్ పడడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో 100 రోజులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇలా అనూహ్య విజయం సాధించడంతో.. విజయ్ తన తదుపరి చిత్రం ‘బేతాళుడు’ అదే జోష్‌లో రిలీజ్ చేశాడు. ఆ మూవీలాగే ఇది కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని భావించి, ఇక్కడి పంపిణీదారులు భారీ రేటుకి రైట్స్ తీసుకున్నారు. కానీ.. అంచనాలన్నీ తారుమారయ్యాయి.
ఈనెల 1వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడం విఫలం అయ్యింది. ఏ అంచనాలతో ఇది రిలీజ్ అయ్యిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో.. అన్ని ఏరియాల నుంచి ఈ చిత్రానికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ దెబ్బకు రెండోరోజు నుంచే కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. ఇక వీక్ డేస్‌లో మరింత దారుణంగా వసూళ్లు పడిపోయాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్‌లో ఈ చిత్రం రూ. 2.64 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా, ఆ తర్వాత మూడురోజుల్లో కేవలం రూ.11 లక్షలే రాబట్టింది. ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే బ్యాడ్ రిపోర్ట్ రావడం వల్లే కలెక్షన్స్ ఇంత దారుణంగా తగ్గాయని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నాయి. పైగా.. ఈ మూవీకి పోటీగా బరిలోకి దిగిన ‘మన్యంపులి’కి పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల, దాని ప్రభావం ‘బేతాళుడు’ కలెక్షన్స్ బాగానే పడిందని అంటున్నారు.
రిలీజ్‌కి ముందు ఏర్పడిన క్రేజ్ కారణంగా ఈ చిత్రం రూ.5 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. ఈ మూవీపై ఉన్న బజ్‌ని చూసి.. ఫస్ట్ వీకెండ్‌లోనే పెట్టిన పెట్టుబడిన రాబడుతుందని భావించారు. కానీ.. రూ.2.75 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇక ‘ధృవ’ రిలీజ్ అవ్వడంతో దాన్ని చాలా థియేటర్ల నుంచి తీసేయాల్సి వచ్చింది. చూస్తుంటే.. టోటల్ రన్‌లో ఆ మూవీ 3 కోట్లు షేర్ రాబట్టడం కష్టమేనని అంటున్నారు. ఈసారి ‘బేతాళుడు’ నిజంగానే ‘బిచ్చగాడు’ అయ్యాడన్నమాట.
ఏరియాలవారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (లక్షల్లో) :
నైజాం : 88
సీడెడ్ : 40
గుంటూరు : 34
ఉత్తరాంధ్ర : 33
వెస్ట్ గోదావరి : 17
ఈస్ట్ గోదావరి : 24
కృష్ణా : 25
నెల్లూరు : 14
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 2.75 కోట్లు (షేర్)