Vijay Antony’s latest movie Bethaludu has earned very well from domestic boxoffice of telugu states in it’s first day run. But from the secondy collections dropped with huge mark, and third day also it eard very less because of bad reports. This movie collected 2.33 crores in it’s 3 days which is not upto the mark.
‘బిచ్చగాడు’ సినిమాతో విజయ్ ఆంటోనీ తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించడంతో.. అతని తదుపరి చిత్రం ‘బేతాళుడు’పై సహజంగానే అంచనాలు పెరిగాయి. పైగా.. ఫస్ట్‌లుక్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిఒక్కటీ ఆసక్తికరంగా ఉండడం.. అలాగే రిలీజ్‌కి ముందు సినిమా ప్రారంభానికి ముందు 10 నిముషాల ఇంట్రొడక్షన్‌తోపాటు వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేయడంతో.. ఈ చిత్రంపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఆంటోనీ మూవీలంటే ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటాయన్న ముద్ర పడిపోవడంతో.. రిలీజ్‌కి ముందు ‘బేతాళుడు’ మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది.
ఆ క్రేజ్ కారణంగానే.. ఈ చిత్రం తొలిరోజు రూ.1.60 కోట్ల షేర్‌తో తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. తెలుగు సినిమాలకే అంతంత మాత్రం వసూళ్లు వస్తున్న ఈరోజుల్లో.. డబ్బింగ్ చిత్రం అయివుండి ఇక్కడ అంతమొత్తం రాబట్టి ట్రేడ్ వర్గాల్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. కానీ.. రెండోరోజు మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయిపోయాయి. కేవలం రూ.45 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక మూడోరోజు చూస్తే.. అంతకంటే దారుణంగా రూ.28 లక్షలే వసూలు చేసింది. అంటే.. మొత్తం మూడురోజుల్లో ఈ మూవీ ఏపీ+తెలంగాణాలో రూ.2.33 కోట్లే రాబట్టింది. ఇంతలా ఈ మూవీ కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి కారణం.. తొలిరోజు బ్యాడ్ రిపోర్ట్ రావడమే. ఏ అంచనాలతో అయితే జనాలు థియేటర్లలోకి సినిమా చూడ్డానికి వెళ్ళారో.. వాటిని అందుకోవడంలో ఈ మూవీ ఫెయిల్ అయ్యింది. అందుకే.. రెండోరోజు నుంచే మూవీ కలెక్షన్స్ తగ్గిపోయాయి.
మరోవైపు.. శుక్రవారం విడుదలైన ‘మన్యంపులి’ చిత్రం ఎఫెక్ట్ కూడా ‘బేతాళుడు’పై బాగానే పడింది. ఆ చిత్రానికి మంచి రిపోర్ట్ రావడం, రెండోరోజు నుంచి కలెక్షన్లు ఊపందుకోవడంతో.. ‘బేతాళుడు’ కలెక్షన్స్ తగ్గాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.5 కోట్లపైనే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి చేరాలంటే.. మరో మూడు కోట్లపైనే వసూలు చేయాల్సి ఉంటుందన్నమాట. మరి.. ‘బిచ్చగాడు’తో డిస్ట్రిబ్యూటర్లను లాభాల పంట పండించిన విజయ్.. ఈసారి నష్టాలు మిగిలిస్తాడా? సేఫ్‌గా బయటపడేస్తాడా? చూడాలి.
ఏరియాలవారీగా 3 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 0.88
సీడెడ్ : 0.33
గుంటూరు : 0.27
ఉత్తరాంధ్ర : 0.26
వెస్ట్ గోదావరి : 0.14
ఈస్ట్ గోదావరి : 0.17
కృష్ణా : 0.18
నెల్లూరు : 0.10
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 2.33 కోట్లు (షేర్)