Finally director Surender Reddy has given clarity why Aseem Mishra left Dhruva movie after one week shoot.
ఈమధ్య చిత్రపరిశ్రమలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టెక్నీషియన్ నుంచి నటీనటుల వరకు ఏదైనా ఓ సినిమా ఒప్పుకున్నాక.. షూటింగ్ మధ్యలోనే ఏదో ఒక వివాదానికి తెరతీయడమో లేదా తప్పుకోవడమో చేస్తున్నారు. ‘ధృవ’ మూవీ విషయంలోనే అలాంటి పరిణామమే ఒకటి జరిగింది.
ఈ మూవీకి మొదట బాలీవుడ్ కెమెరామెన్ అశిమ్ మిశ్రాని తీసుకున్నారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ హిట్ చిత్రాలకు పనిచేసిన అతణ్ణి మంచి పారితోషకమే ఆఫర్ చేసి సెలెక్ట్ చేసుకున్నారు. అయితే.. వారం రోజులు తిరగకుండానే అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అంతే.. అప్పటినుంచి దానిపై రకరకాల రూమర్లు రావడం మొదలయ్యాయి. యూనిట్‌లో విభేదాలు రావడం వల్లే అతడు తప్పుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆ వార్త్లల్లో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు సురేందర్ రెడ్డి వెల్లడించాడు. అతను ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిపాడు.
‘ధృవ’ ఒప్పుకున్న వారం రోజుల తర్వాత అశిమ్ మిశ్రాకి సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ట్యూబ్‌లైట్’ మూవీ ఆఫర్ వచ్చింది. అతని చిత్రాలకి ఆల్రెడీ అశిమ్ పనిచేయడం, సల్మాన్‌తో ఉన్న స్నేహబంధం కారణంగా.. ఆ అవకాశాన్ని వదులుకోలేక పోయాడు. అందుకే.. రామ్ చరణ్ సినిమాని వదిలేసి వెళ్ళాడని, నిర్మాతల నుంచి తీసుకున్న పారితోషికం కూడా వెనక్కు ఇచ్చేశాడని సురేందర్ క్లారిటీ ఇచ్చాడు. అతనలా వెళ్ళిపోవడం వల్ల అతని స్థానంలో పీఎస్ వినోద్‌ని సినిమాటోగ్రాఫర్‌గా తీసుకోవడం జరిగిందని తెలిపాడు.