Newsగతం చెప్పి కంటతడి పెట్టించిన సుడిగాలి సుధీర్

గతం చెప్పి కంటతడి పెట్టించిన సుడిగాలి సుధీర్

Sudigali Sudheer has given a emotional speech at UNIK LIFE event in which he revealed his past life where he struggled to reach this position. His story will inspire everyone to improve our skills and reach to goal.

కొందరు వారసత్వంతో ఇండస్ట్రీలో కాలుమోపితే.. మరికొందరు తమ టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎదుగుతూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాంటివారిలో జబర్దస్త్ కమెడియన్ ‘సుడిగాలి సుధీర్’ని కూడా ఒక్కడిగా చెప్పుకోవచ్చు. బుల్లితెరపై నవ్వులు పూయించే ఇతను.. పరిశ్రమలోకి రాకముందు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న తరుణంలో తండ్రి హఠాన్మరణం పొందడంతో.. బాధ్యతలన్నీ సుధీర్‌మీదే పడ్డాయి. అప్పటినుంచి కుటుంబ పోషణ కోసం అతను పడ్డ అష్టకష్టాలు అన్నీఇన్నీ కావు. అతని గతం వింటే.. ప్రతిఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రీసెంట్‌గా యూనిక్ లైఫ్ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుధీర్ తన గత జీవితం గురించి చెప్పి, కంటతటి పెట్టించాడు. అప్పటివరకు హాయిగా సాగిన తమ జీవితం తండ్రి మరణానంతరం అనూహ్య మలుపు తిరిగిందని, ఆర్థికపరమైన ఇబ్బందులు తీవ్రం కావడంతో తాను చదువు మధ్యలోనే ఆపేసి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండేళ్ళపాటు 8 వేల జీతానికి ఓ ఉద్యోగం చేశానని అన్నాడు. ఏదో సాధించాలన్న ఆకాంక్షతో ఆ జాబ్ మానేసి సిటీకొచ్చానని తెలిపిన సుధీర్.. అప్పుడు తాను జీవితంలో అసలు కష్టాలు చూశానని అన్నాడు. తినడానికి తిండిలేక రూ.10 ప్రియా పచ్చడి ప్యాకెట్లు తినేవాడినని, తాగడానికి నీళ్ళులేక సింక్ పైపులో వచ్చే నీళ్ళు తాగే వాడినని.. ఇలా రెండున్నరేళ్లు చాలా కష్టపడ్డానని చెప్పాడు. ఆ సమయంలో తాను చాలా డిప్రెస్ అయ్యానని చెప్పిన సుధీర్.. తాను స్ర్కీన్ మీద కనిపించాలన్న తన అమ్మ కోరికని ఎలాగైనా నెరవేర్చాలని ఫిక్స్ అయ్యానని.. ఆ రోజు అలా అడుగులువేసి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని వివరించాడు.

ఈ సినిమా ఆఫర్లు వచ్చినా, యాంకరింగ్‌ అవకాశాలు ఉన్నాయని తెలిసినా.. అమ్మ ఎప్పుడు నాన్నకు బాబు ఫోటోస్ పంపండని చెబుతూ ఉండేదని, వెండితెర మీద తనని చూడాలని నిత్యం కోరుకునేదని పేర్కొన్నాడు. స్కూల్‌లో, కాలేజ్‌లో తాను యాక్టింగ్‌లో ఫస్ట్ వచ్చేవాడనని.. ఆ రంగంలో కొనసాగాలనే తన తల్లి కోరుకునేదని అన్నాడు. చివరికి తన తల్లి కోరికని నెరవేర్చడంలో తాను సక్సెస్‌నయ్యానని ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు సుధీర్. ప్రతిఒక్కరికీ తనలాగే ఓ సమయం వస్తుందని, అప్పటివరకు ఓపిగ్గా ఉండాలని, అది వచ్చినప్పుడు తమ టాలెంట్ నిరూపించుకోండని అందరికీ ఓ మెసేజ్ ఇచ్చి, స్పీచ్ ముగించాడు సుధీర్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news