Finally, the behind Trisha latest video going viral on internet on MMS leaked name, has been revealed. That video clip belongs to Chikati Rajyam movie in which Kamal Hassan played lead role.
గతకొన్ని రోజుల నుంచి చెన్నైబ్యూటీ త్రిషకి సంబంధించి ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో ఆ అమ్మడు సెక్సీగా హావభావాలు పలకడంతో.. అది ఆమె ఎమ్మెమ్మెస్ వీడియో అని నెటిజన్లు అనుకుంటున్నారు. వెబ్సైట్లు సైతం న్యూస్‌లు అలాగే రాస్తున్నాయి. గతంలో ఓ బాత్రూం వీడియోతో హల్చల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో హాట్ ఎమ్మెమ్మెస్తో సంచలనం సృష్టిస్తోందని వార్తల మీద వార్తలు రాస్తూ.. ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. దీంతో.. అది నిజంగానే త్రిష ‘బూతు’ వీడియో అయి ఉంటుందని జనాలు ఓ అంచనాకి వచ్చేశారు. కానీ.. నిజానికి అది అశ్లీల వీడియో కాదు. ఆ క్లిప్ ఆమె నటించిన ఒక సినిమాకి సంబంధించింది.
కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన బైలింగ్వల్ చిత్రం ‘చీకటి రాజ్యం’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మూవీలోనిదే ఆ సన్నివేశం. క్లైమాక్స్‌లో ఆ సన్నివేశం వస్తుంది. విలన్లలో ఒకరు ఆమె చేతిని వెనుకనుంచి పట్టుకున్నప్పుడు.. ఆ బాధతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది. ఆ క్లిప్నే ఓ ప్రబుద్ధుడు జూమ్ చేసి, కేవలం త్రిష ఎక్స్ప్రెషన్లు మాత్రమే కనిపించేలా వీడియో ఎడిట్ చేశాడు. దాన్ని నెట్లో ‘త్రిష షాకింగ్ ఎమ్మెమ్మెస్ వీడియో లీక్’అనే టైటిల్‌తో అప్లోడ్ చేశాడు. అప్పటినుంచి ఈ వీడియో వైరల్ అవుతోంది. అది.. ఈ వీడియో వెనకున్న అసలు సంగతి.