Songs writer Sitarama Sastry praises balayya fans in gautamiputra satakarni audio launch and counter on other hero fans who shouted for no reason.
ఈమధ్య కొందరు హీరోల అభిమానుల్లో జోష్ ఎక్కువైపోయింది. తమ అభిమాన నటుడు కనిపిస్తే.. కేకలు, కేరింతలతో హోరెత్తడం మొదలుపెట్టేస్తున్నారు. మరికొందరైతే.. ఇతర ఈవెంట్లలోనూ అనవసరంగా రచ్చ చేస్తున్నారు. నిజానికి.. వాళ్ల దృష్టిలో ఆలోచిస్తే తాము అభిమానం మాత్రమే చాటిచెబుతున్నామని ఫీలింగ్ ఉంటుంది. కానీ.. వాస్తవానికి వాళ్లు చూపించే ఆ అభిమానం ఆ ఈవెంట్‌నే డిస్టర్బ్ చేస్తుంది. ఈ విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. తమ పంథా తమదే అన్నట్లుగా దూసుకెళుతున్నారు. ఇలా అల్లరి చేసే గ్యాంగ్‌కి గేయరచయిత సీతారామ శాస్త్రి భారీ కౌంటర్ ఇచ్చారు.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో ఎంతో హుందాగా మాట్లాడిన ఆయన.. మధ్యలో ఫ్యాన్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘బాలయ్య అభిమానులు చాలా సభల్లో కన్నా చక్కని క్రమశిక్షణతో ఉన్నారు.. మీరు అలా ఉంటేనే సంతోషం’ అని సీతారామశాస్త్రి అన్నారు. అంటే.. ఇతర హీరోల అభిమానులు అలా క్రమశిక్షణతో ఉండరని చురకలంటించారు. ఈమధ్య కొందరు ఫ్యాన్స్ చేసిన రచ్చని దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ విధమైన కామెంట్స్ చేశారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.