Movies‘ధృవ’ బాడీకి ఫిదా అయిన కండలవీరుడు సల్మాన్ ఖాన్

‘ధృవ’ బాడీకి ఫిదా అయిన కండలవీరుడు సల్మాన్ ఖాన్

Bollywood star Salman Khan praises Ram Charan’s body for which he work out for Dhruva film.

‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్ స్టైలిష్‌గా కనిపించడంతోపాటు బాడీ విషయంలోనూ వావ్ అనిపించాడు. బ్రాడ్ షోల్డర్స్, టోన్డ్ బాడీతో.. నిజంగా పోలీస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలనుకునేలా అనిపించాడు. అలా తననితాను మార్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడో.. ఇప్పుడు అంతే కాంప్లిమెంట్స్ సంపాదించుకుంటున్నాడు. పైగా.. సినిమా కూడా హిట్ అవ్వడంతో అతనిపై పొగడ్తల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా సల్మాణ్ ఖాన్ కూడా అతని బాడీని చూసి.. ప్రశంసలు కురిపించాడు.

అవును.. మీరు చదువుతోంది నిజమే. ఎవరైతే ‘సిక్స్ ప్యాక్ బాడీ’ ట్రెండ్‌ని మొదలుపెట్టాడో.. బాలీవుడ్ కండలవీరుడుగా ఇప్పటికీ పరిగణించబడుతున్నాడో.. అతను చెర్రీ కండల్ని పొగిడాడు. ‘రామ్ చరణ్ బాడీ సూపర్.. గో ఎహెడ్’ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దీంతో.. హ్యాపీగా ఫీల్ అయిన చరణ్ ఆ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు‘థ్యాంక్స్’కూడా చెప్పుకున్నాడు. నిజానికి.. మెగా కుటుంబంతో సల్మాన్‌కి మంచి అనుబంధం ఉంది. చిరుని సల్మాన్ ఎంత అభిమానిస్తాడో, చరణ్‌నీ అంతే అభిమానిస్తాడు. అంతేకాదు.. బాడీ బిల్డప్‌కి సంబంధించిన సలహాలు కూడా చరణ్‌కి ఇస్తుంటాడు. ఇప్పుడు ‘ధృవ’లో జబర్దస్త్‌గా కనిపించడంతో.. సల్మాన్ కాంప్లిమెంట్స్ ఇచ్చేశాడు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news