Controversial director Ram Gopal Varma has made sensational comments another through twitter indirectly on Megastar Chiranjeevi’s prestigeous 150 project after Gautamiputra Satakarni Trailer release.
సాధారణంగానే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకి లౌక్యం ఎక్కువ. దానికి కాస్త మసాలా జోడిస్తే.. బ్రహ్మాండం బద్దలవ్వాల్సిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ చూసిన అనంతరం ఈ దర్శకుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నేరుగా మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఖైదీ నెంబర్ 150’ని టార్గెట్ చేస్తూ.. ట్వీట్ల ద్వారా దండయాత్ర చేశాడు.
తొలుత ట్రైలర్ చాలా బాగుందని, దర్శకుడు క్రిష్ పనితనానికి ఎన్ని మార్కులేసిన తక్కువేనంటూ కొనియాడుతూ ఓ ట్వీట్ చేశాడు. ‘తెలుగు చిత్రపరిశ్రమకు మరో స్థాయికి తీసుకెళుతున్నందుకు నేను దర్శకుడు క్రిష్‌కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. క్రిష్ దర్శకత్వంతో ఈ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నందుకు బాలయ్యకి శుభాకాంక్షలు’ అంటూ ట్వీటాడు. ఇక ఆ తర్వాత చిరు 150వ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ.. సంచలన కామెంట్స్ చేశాడు. ‘శాతకర్ణి ట్రైలర్‌లోని ఫైట్స్ చూస్తే.. సంక్రాంతి పండుగనాడు ఈ చిత్రానికి పోటీయే లేదు. చూస్తుంటే.. వార్ పూర్తిగా వన్‌సైడ్‌లా అనిపిస్తోంది. నిజమైన ‘కత్తి’ కన్నా.. దర్శకుడు క్రిష్ ‘గౌతమీపుత్ర ‘శాట’కర్ణి ట్రైలర్ చాలా షార్ప్‌గా ఉంది’ అంటూ వర్మ ధ్వజమెత్తాడు.
ఈ విధంగా వర్మ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ‘శాతకర్ణి’, ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాలు వేర్వేరే జోనర్‌కి చెందినవని.. వాటిని పోలుస్తూ కామెంట్స్ చేయొద్దని కొందరు వేడుకుంటున్నారు. మరికొందరు… వర్మకి వివాదాలు సృష్టించడం తప్ప మరో పనిలేదంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. చూడబోతే.. ఈ వ్వవహారం పెద్ద వివాదంలా రాజుకునేలా కనిపిస్తోంది.
I bow to @DirKrish for taking telugu cinema once again to the next level??? ..Congrats Bala krishna gaaru ??? https://t.co/SPhnTO9hOV
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2016
After Satakarni fights
there is no more Sankranthi
Fight ..War looks completely ONESIDED @DirKrish https://t.co/SPhnTO9hOV— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2016
A truly real Katthi kanna mega sharp trailer is @DirKrish ‘s Gautami Putra Shaata Karni https://t.co/SPhnTO9hOV
— Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2016