Movies మెగాఫ్యామిలీ మీదే జోకులా.. వాళ్లకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పిన...

మెగాఫ్యామిలీ మీదే జోకులా.. వాళ్లకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పిన రామ్ చరణ్

Ram Charan has given strong counter to them who trolls mega family for making remakes. Watch below video what he told.

టాలీవుడ్‌లో ఈమధ్య ప్రయోగాత్మక సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ మాస్ మసాలా సినిమాలకు సినీజనాలు ఎప్పుడో గుడ్‌బై చెప్పేయడంతో.. ప్రతి హీరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోలు కూడా తమ స్టార్‌డమ్‌ని పక్కనపెట్టేసి.. స్ర్కిప్ట్ బేస్డ్ సినిమాలే చేస్తున్నారు. హీరోల నుంచి ఆడియెన్స్ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి.. అందరూ ఆ బాటలోనే నడుస్తున్నారు. ఇలాంటి సమయంలో.. మెగాహీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు రీమేక్ సినిమాలు చేస్తున్నారు. దీంతో.. ఈ ముగ్గురు హీరోలపై సినీజనాలు ధ్వజమెత్తారు.

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తున్న రోజుల్లో.. రీమేక్ సినిమాలు చేయడం ఏంటని వారిపై మండిపడుతున్నారు. సక్సెస్‌ల కోసం కేవలం రీమేకులనే నమ్ముకోవాలా? కొత్త స్టోరీలతో సినిమాలు చేసి.. తమ సత్తా నిరూపించుకోవచ్చు కదా? ఆ ధైర్యం లేదా?  అంటూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మెగాఫ్యామిలీ మొత్తం రీమేక్ సినిమాల్ని నమ్ముకునే ముందుకు సాగాలని, కొత్త స్టోరీలతో సినిమాలు చేసే దమ్ము లేదంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సోషల్ మీడియాలో అయితే.. ఈ ముగ్గురు హీరోల్ని టార్గెట్ చేస్తూ జోకులు పేల్చుతున్నారు. రకరకాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా తమ మీద కామెంట్స్ చేసిన వారికి రామ్ చరణ్ చెప్పుతో కొట్టినట్లుగా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

‘అందరూ రీమేక్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.. రీమేక్ కూడా ఒక సినిమానే. మాకు కథలు లేక కాదు.. కొత్త కథలతో సినిమాలు చేయలేక రీమేక్‌లు చేయడం లేదు. ఇతర ఇండస్ట్రీలో హిట్ అయిన మంచి సినిమాల్ని తెలుగు ఆడియెన్స్‌కి కూడా చూపించాలనే తాపత్రయంతోనే రీమేక్‌లు చేస్తున్నాం. నేను, నాన్న (చిరంజీవి) రీమేక్‌లు చేశాం.. పవన్ కళ్యాణ్ కూడా రీమేక్ చేస్తున్నారు.. మెగా ఫ్యామిలీ ఎందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నారంటే మీరేం (ఫ్యాన్స్) పట్టించుకోకండి.. అన్ని మంచి సినిమాలే.. ఆడియెన్స్‌ని అవి ఖచ్చితంగా అలరిస్తాయి’ అంటూ రామ్ చరణ్ ఓ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news