Movies‘ధృవ’ యూఎస్ కలెక్షన్స్.. మిలియన్ మార్క్ దిశగా చరణ్ పరుగులు

‘ధృవ’ యూఎస్ కలెక్షన్స్.. మిలియన్ మార్క్ దిశగా చరణ్ పరుగులు

Ram Charan’s latest film Dhruva has doing very well at USA boxoffice. Finally Cherry is going to reach his dream million mark.

టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించిన రామ్ చరణ్.. యూఎస్‌లో మాత్రం తన సత్తా చాటుకోలేకపోయాడు. ఓవైపు యంగ్ హీరోలందరూ 1 మిలియన్ మార్క్‌ని సునాయాసంగా క్రాస్ చేస్తుంటే.. ఈ మెగాహీరో మాత్రం హాఫ్ మిలియన్ మార్క్ వద్దే ఆగిపోతున్నాడు. దీంతో.. ఈసారి ‘ధృవ’తో ఎలాగైనా అక్కడ ఆ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేయాలని భావించాడు. అందుకు భారీ ప్రణాళికలే రచించాడు. అక్కడ మొదటినుంచే తన చిత్రాన్ని బాగా ప్రమోట్ చేయించడంతోపాటు భారీఎత్తున (ఏకంగా 202 థియేటర్లలో) రిలీజ్ చేశాడు. అంతేకాదు.. స్వయంగా అక్కడికెళ్ళి, తన ఫ్యాన్స్‌తో ప్రీమియర్ షోస్ కూడా చూశాడు.

ఆ రేంజులో చెర్రీ స్కెచ్ వేయడం, అన్ని ఏరియాల్లో ఈ మూవీపై బజ్ బాగానే ఉండడంతో.. ఈసారి ‘ధృవ’తో చరణ్ అక్కడ ప్రభంజనం సృష్టిస్తాడని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ మెగాహీరో అక్కడ తన సత్తా చాటుతున్నాడు. ప్రీమియర్స్‌తో కాస్త నిరాశపరిచినా.. శుక్రవారం మాత్రం అదిరిపోయే రేంజులో వసూళ్లు రాబట్టాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్స్ ద్వారా $223,224 (రూ.1.51 కోట్లు) రాబట్టిన ‘ధృవ’, శుక్రవారం $244,214 (రూ.1.65 కోట్లు) వసూలు చేసింది. అంటే.. టోటల్‌గా $468,085 (రూ. 3.16 కోట్లు) ఈ మూవీ ఖాతాలో చేరాయన్నమాట. ఇక శనివారం కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లే రాబట్టిందని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు.

ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతోపాటు అక్కడి ఆడియెన్స్‌కి ఆకట్టుకునే కాన్సెప్ట్ కావడం కూడా బాగా కలిసొచ్చిందని, అందుకే శుక్రవారం కలెక్షన్లు అనూహ్యంగా పెరిగాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. మొత్తానికి చరణ్ త్వరలోనే ‘డ్రీమ్’ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేయబోతున్నాడన్నమాట.

Latest news