Here we are presenting the exclusive pre review of Ram Charan’s latest movie Dhruva which is going to be release on 9th December. This movie directed by Surender reddy and produced by Allu aravind under geetha arts banner. Rakul Preet Singh played lead female role and Aravind Swamy as antagonist.
సినిమా : ధృవ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, తదితరులు
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
నిర్మాత : అల్లుఅరవింద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
వరుసగా రెండు పరాజయలు చవిచూసిన రామ్ చరణ్.. ఈసారి ఎలాగైనా హిట్ సాధించాలన్న కసితో ‘ధృవ’ సినిమా చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో.. ఒరిజినల్‌లో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామీనే నటించాడు. సెట్స్ మీదకి వెళ్ళినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత పోస్టర్స్, టీజర్, ట్రైలర్లతో మరిన్ని అంచనాలు పెంచుకుంది. మరి.. వాటిని ఇది అందుకుంటుందో లేదో చూడాలి.
కథ :
అరవింద్ స్వామి అనే ఓ బిజినెస్‌మేన్ తెరవెనుక ఉండి అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. మొత్తం సిస్టమ్‌ని తన కంట్రోల్ పెట్టుకుని నడిపిస్తుంటాడు. బయటి ప్రపంచానికి మాత్రం తానో సీదాసాదా వ్యక్తినని చెప్పుకుని తిరుగుతుంటాడు. అందరితో స్నేహభావంతో మెలుగుతూ మంచివాడిలా ప్రవర్తిస్తుండడంతో.. అసలు ఇతనో పెద్ద గ్యాంగ్‌స్టర్ అన్న విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోతారు. అప్పుడే ఇతని అరాచకాలను అరికట్టేందుకు ధృవ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అరవింద్‌కి సంబంధించి ఒక్క క్లూ దొరక్కపోయినా.. తన తెలివితో అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకు ధృవ చేసిన ప్లాన్స్ ఏంటి? ధృవ గురించి తెలుసుకున్న అరవింద్ అతని వేసే ఎత్తుగడల్ని ఎలా ఎదుర్కొంటాడు? మొత్తం సిస్టమ్‌నే తన కంట్రోల్‌లో పెట్టుకున్న అరవింద్‌ని ధృవ పట్టుకోగలుగుతాడా? లేదా? అనే అంశాలతో ఈ మూవీ కథ సాగుతుంది.
విశ్లేషణ:
‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్, జగపతిబాబు మధ్య సాగే మైండ్‌గేమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ‘ధృవ’లో ఆ జోనర్‌కి చెందిన చిత్రమే. అయితే.. ఇందులో నడిచే మైండ్‌గేమ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఎంతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఎక్కడో ఓ చోట చూపించిన వస్తువుని, మరెక్కడో సన్నివేశంలో లింక్ ఉండేలా జోడించడం.. దాన్ని చూపించిన తీరు ఔరా అనిపించేలా ఉంటాయి. చరణ్-అరవింద్ మధ్య సాగే సంభాషణ, సీన్లు పతాక స్థాయిలో ఉంటాయి. అక్కడక్కడ డల్‌గా ఉండే కామెడీ, హీరోహీరోయిన్ల మధ్య రొటీన్ రొమాన్స్ కాస్త బోర్ కొట్టించినా.. మిగతా పార్ట్ మొత్తం చాలా థ్రిల్లింగ్‌గా సాగుతూ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంది.
ప్రారంభంనుంచే ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యే ఈ మూవీలో మొదటి 20 నిముషాలు అదిరిపోయింది. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మూవీకే హైలైట్. సెకండాఫ్‌లో హీరో-విలన్ మధ్య నడిచే మైండ్‌గేమ్ పీక్స్. ఇక సినిమాని ముగించిన తీరు బాగుంది. సందర్భానుకూలంగా వచ్చే పాటలు చాలా బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అదిరాయి. కొన్ని డైలాగ్స్ అందరినీ ఆలోచింపచేశాలా ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే.. మధ్యలో కొన్ని లోపాలు మినహాయిస్తే, ఈ చిత్రం అదిరింది.
నటీనటుల పనితీరు :
గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ మూవీలో చరణ్ తన నటనలో పరిణతి కనబరిచాడు. తన ఇమేజ్‌కి భిన్నంగా ఉండే రోల్‌లో నటించి అబ్బుపరిచాడు. మొదటినుంచి చివరివరకు తన క్యారెక్టర్‌ని బాగా బ్యాలెన్స్ చేశాడు. ఇక డ్యాన్స్, యాక్షన్ సీన్లలో ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో చాలా అందంగా కనిపించింది. ఆమె రోల్ కాస్త తక్కువే అయినా.. ఉన్నంతలో గ్లామరసం ఒలకబోయడంతోపాటు మంచి అభినయం కనబరిచింది. ఇక అరవింద్ స్వామి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ క్యారెక్టర్‌ని తను తప్ప మరెవ్వరో న్యాయం చేయరనేంతగా జీవించాడు. చరణ్‌కి గట్టి పోటీ ఇచ్చి హైలైట్ అయ్యాడు. మిగతా నటీనటులు ఫర్వాలేదు.
టెక్నికల్ పనితీరు :
ఈ మూవీకి పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అతని కెమెరా పనితనానికి మెచ్చుకోక ఉండలేం. హిప్‌హాప్ తమిళ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక అదరగొట్టేశాడు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ బాగుంది. వేమరెడ్డి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. ఇక సురేందర్ రెడ్డి గురించి మాట్లాడితే.. ‘కిక్-2’తో భారీ పరాజయం చెందిన ఇతగాడు ఈ చిత్రాన్ని కసిగా తీసినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుని తెరకెక్కించాడు. మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు.