Movies‘ధృవ’ మూవీ ఫస్ట్ టాక్.. రామ్ చరణ్ ‘వన్ మ్యాన్ షో’

‘ధృవ’ మూవీ ఫస్ట్ టాక్.. రామ్ చరణ్ ‘వన్ మ్యాన్ షో’

Ram Charan’s latest movie Dhruva has got positive reports from US premiers. According to the critics, this movie has reached upto the mark. Surender Reddy executed this film very stylish which impress the audience. Ram Charan and Aravind Swamy showed their excellent talent on screens. Their episode are the major highlights in this movie.

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రామ్ చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ధృవ’.. రెండుసార్లు వాయిదా పడి చివరికి ఈరోజు (09-12-2016) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక్కడికంటే ముందు యూఎస్‌లో ప్రీమియర్స్ షో వేయగా.. అక్కడి క్రిటిక్స్ నుంచి మంచి మార్కులే పడ్డాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’కి రీమేక్ ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి వెండితెరపై తెలుగు ఆడియెన్స్‌కి అనుకూలంగా ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని అంటున్నారు. మొదటినుంచి చివరి వరకు టెంపో మిస్ అవ్వకుండా.. ఆడియెన్స్‌ని కుర్చీలకు అతుక్కునిపోయేలా కూర్చోబెట్టడంలో విజయం సాధించాడని, ఏ అంచనాలతో విడుదల అయ్యిందో వాటిని అందుకోవడంలో విజయం సాధించని చెబుతున్నారు.

కథ చాలా బాగుందని, కొత్తదనం కోరుకునే ఆడియెన్స్‌ని కట్టిపడేస్తుందని, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగానే సురేందర్ ఈ మూవీని ఆసక్తికరంగా తీర్చిదిద్దాడని, ప్రశంసలు కురిపిస్తున్నారు. సాంగ్స్ లొకేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బాగా కుదిరాయని అక్కడి టాక్. మధ్యలో అక్కడక్కడ కాస్త టెంపో మిస్ అయినా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండడంతో వాటిని మరిపిస్తాయని సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే.. హానెస్ట్ పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్ అదరగొట్టేశాడని, మునుపటి సినిమాల్లోకంటే ఇందులో నటనలో మంచి పరిణతి కనబరిచాడని, ఫస్ట్ నుంచి చివరివరకు తన పాత్రలో పూర్తిగా జీవించేశాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక కరెప్టెడ్ బిజినెస్‌మేన్‌గా అరవింద్ స్వామి అతనికి పోటీగా అద్భుతంగా నటించాడట. ఇద్దరూ నువ్వానేనా అనేంతగా తమ ప్రతిభ కనబరిచారని, వీరిమధ్య వచ్చే సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని యూఎస్ టాక్. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరసం బాగా పండించడంతోపాటు నటనలో ప్రతిభ చూపింది. ఇతర నటీనటులు సైతం తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీం పరంగా చూస్తేం.. సురేందర్ రెడ్డి టేకింగ్ సూపర్బ్. రీమేక్ చిత్రం అయినప్పటికీ.. తెలుగు ఆడియెన్స్‌కి తగ్గట్టు మార్పులు చేసి, తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా తీర్చిదిద్ది ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ అన్ని ఎక్సలెంట్‌గా ఉన్నాయని.. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టాల్సిన అవసరం లేదని యూఎస్ రిపోర్ట్. అక్కడి ఆడియెన్స్ సైతం ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అంటూ కితాబిస్తున్నారు. మొత్తానికి.. రెండు ఫ్లాపుల తర్వాత చరణ్ సరైన చిత్రాన్నే ఎంచుకుని, ట్రాక్‌లోకి వచ్చాడన్నమాట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news