Ram Charan’s latest movie Dhruva doing well at the worldwide boxoffice. In it’s first week run this movie has entered in 40 crore club which is record figure form Charan in that time.
భారీ అంచనాల మధ్య ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’అంచనాలకు తగ్గట్టుగానే మంచి వసూళ్లతో రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్‌లో ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం.. ఆ తర్వాత వీక్ డేస్‌లోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ దూసుకెళుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. గురువారంతో వారం రోజులు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.42.19 కోట్లు కలెక్ట్ చేసింది. తొలివారంలో ఈ రేంజ్ వసూళ్లు రావడం.. రామ్ చరణ్ కెరీర్‌లోనే రికార్డ్. నోట్ల రద్దు ఎఫెక్ట్‌ని ఎదుర్కొని ‘ధృవ’ ఇంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషమేనని అంటున్నారు.
ఇక ఈ వారంలో వచ్చిన చిన్న సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అటు.. వచ్చేవారం విడుదల కావాల్సిన ‘సింగం-3’ సడెన్‌గా వాయిదా పడింది. ఈ రెండు అంశాలు ‘ధృవ’కి బాగానే కలిసొస్తాయి. మరో రెండువారాల పాటు సోలోగా బాక్సాఫీస్‌పై రామ్ చరణ్‌దే దండయాత్ర. దీంతో.. ఈ మూవీ కలెక్షన్లు మరిన్ని పెరగవచ్చునని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ‘తని ఒరువన్’కి రీమేక్ అయిన ఈ మూవీని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా.. రామ్ చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, విలన్‌గా అరవింద్ స్వామీ అదరగొట్టేశారు.
ఏరియాలవారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 10.69
సీడెడ్ : 5.05
వైజాగ్ : 3.90
గుంటూరు : 2.63
ఈస్ట్ గోదావరి : 2.34
కృష్ణా : 2.18
వెస్ట్ గోదావరి : 2.07
నెల్లూరు : 0.98
ఏపీ+తెలంగాణ : రూ. 29.84 కోట్లు
కర్ణాటక : 5.60
ఓవర్సీస్ : 5.50
రెస్టాఫ్ ఇండియా : 1.25
టోటల్ వరల్డ్‌వైడ్ : రూ. 42.19 కోట్లు (షేర్)