Tollywood ace director Rajamouli has praised Dhruva movie and unit members. But he mentioned only writer is the real hero for this movie.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. ఏ అంచనాలతో అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. మైండ్‌గేమ్‌తో సాగే ఈ సినిమా.. ఆడియెన్స్ నుంచే కాదు.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ప్రతిఒక్కరూ రామ్ చరణ్ బ్రహ్మాండమైన ఎంట్రీ ఇచ్చాడని కొనియాడుతున్నారు. ఎవరైతే చరణ్‌కి ఎక్స్‌ప్రెషన్స్ రావన్నారో.. వాళ్లే ఇప్పుడు అతని నటనని మెచ్చుకుంటున్నారు. ఇక చరణ్ తర్వాత అద్భుతమైన నటన ప్రదర్శించిన అరవింద్ స్వామీని సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇలా టాలీవుడ్ మొత్తం ఆ ఇద్దరి గురించి మాట్లాడుకుంటుంటే.. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ ఇద్దరి హీరోల్ని పొగుడుతూనే.. ఈ చిత్రానికి మూలకారకమైన ఓ వ్యక్తిని ఆకాశానికేత్తేశాడు. ఆ ఇద్దరికంటే అసలైన రియల్ అతడేనంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. కథ అందించిన మోహన్ రాజా! కథలు రాయలేక రైటర్స్ అందరూ విలవిలలాడుతున్న ఈరోజుల్లో.. ‘ధృవ’లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీని తయారుచేయాలంటే మామూలు విషయం కాదు. ఎంతో రీసెర్చ్ చేసి, మెదడుకు పదును పెట్టి, రాంత్రిబవళ్లు దానిమీదే ఏకాగ్రత చూపాలి. అప్పుడే.. అది సాధ్యమవుతుంది. ఈ విషయం రాజమౌళి తెలుసు కాబట్టి.. ఈ చిత్రానికి రియల్ హీరో అతడేనంటూ మోహన్ రాజాపై పొగడ్తల వర్షం కురిపించాడు.
‘స్టార్ ఇమేజ్‌కి పక్కనపెట్టేసి, కథకు ప్రాముఖ్యతనిచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్‌కి నా అభినందనలు. కథకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే ఈ చిత్రం మొదటినుంచి చివరిదాకా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇందులో చరణ్ తన శరీరాకృతితో సినిమా మొత్తంలో అద్భుతంగా కనిపించాడు. అలాగే.. పాత్రకు తగ్గట్టు హావభావాలు పలుకుతూ అద్భుతంగా నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అందంగా కనిపిస్తూనే చాలా బాగా నటించింది. ఇక తమిళ్‌లో ఆల్రెడీ తననితాను నిరూపించుకున్న అరవింద్ స్వామీ తెలుగులో కూడా అదరగొట్టాడు. అందరూ చాలా బాగా చేశాడు. అయితే.. ఈ చిత్రానికి కథ రాసిన రైటర్‌కు ఫుల్ మార్కులు దక్కుతాయి. ఇంతటి అద్భుతమైన కథని అందించినందుకు అతడు ‘ధృవ’కి అసలైన రియల్ హీరో’ అంటూ ట్విటర్ వేదికగా జక్కన్న వివరించాడు.