Movies నిండుసభలో యాంకర్ సుమకి సూపర్ పంచ్ ఇచ్చి షాకిచ్చిన రాజ్...

నిండుసభలో యాంకర్ సుమకి సూపర్ పంచ్ ఇచ్చి షాకిచ్చిన రాజ్ తరుణ్

Young hero Raj Tarun given shock to anchor Suma on Satamanam Bhavati audio launch by teasing her. This incident shocks every one. But Suma has given an extroardinary reply.

ఒకప్పుడు హీరోయిన్లు, ఇతర భామలపై బూతు వ్యాఖ్యలు చేసి కమెడియన్ ఆలీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. ఇప్పుడు యంగ్ హీరో రాజ్ తరుణ్ బూతు కామెంట్స్ చేయడం లేదుగానీ.. ఊహించని కామెంట్స్ చేస్తూ అందరికీ షాకిస్తున్నాడు. ప్రేమ, పెళ్ళిళ్ల వ్యవహారాలపై తన నోరుకి బాగానే పని చెబుతున్నాడు. ఏదైనా ఈవెంట్‌కి హాజరైతే.. అక్కడున్న భామల్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుని, వారిపై సెటైర్లు వేయడం, ఇంకా ఏవేవో కామెంట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంటాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి, అందరి దిమ్మతిరిగేలా చేశాడు.

గత ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ‘శతమానం భవతి’ ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా యాంకర్ సుమ అతిథులందరికీ ‘మీ పెళ్ళెప్పుడు’ అని ప్రశ్నలు అడిగింది. పెళ్లికి సంబంధించిన కాన్సెప్ట్‌‌తో ఆ సినిమా తెరకెక్కడంతో.. ప్రతిఒక్కరికీ ఆ ప్రశ్న సంధించింది యాంకర్ సుమ. ఇక ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో రాజ్ తరుణ్ వేదికపైకి రాగా.. ‘నీకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా’ అని ప్రశ్నంచింది. దీనికి రాజ్‌తరుణ్‌ తనకు మరో మూడేళ్ల వరకు ఆ ఆలోచన లేదని చెప్పాడు. ఆ వెంటనే..‘ఇప్పటికీ మీకు పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. ఆ ఆలోచన ఉండేది. ఇప్పుడు పెళ్లి ఆలోచన లేద’ని సమాధానమిచ్చాడు. ఈ జవాబుకు సుమతో పాటు అక్కడికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు.

అయితే.. ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు దానికి రిటార్ట్ ఎలా వేయాలో సుమకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. ఈసారి కూడా ఆమె తన టాలెంట్ చూపించింది. ఇంకా పెళ్ళి కాని రాజ్ తరుణ్‌కి ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అని చెప్పింది. ఇంకా పెళ్ళవ్వలేదుకదా అని రాజ్ అంటే.. ‘ఎప్పుడు పడితే అప్పుడు.. పడుంటుంది.. పెట్టేసుకోండి’ అంటూ సుమ రిప్లై ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news