Raghavendra Rao latest directorial movie ‘Om Namo Venkatesaya’ first teaser out and it is devotional, eye cathing, colourful and interesting. In this teaser King Nagarjuna shows his kills as in his past films.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌లో కేవలం భక్తిరసమే కాదు, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కళ్లుచెదిరే గ్రాఫిక్స్‌తో చాలా కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ టీజర్‌కి ప్రతిఒక్కరూ ఆకర్షించబడతారు. తొలుత టైటిల్, పోస్టర్లను చూసి.. ఈ మూవీ మొత్తం భక్తితోనే నిండివుంటుందని అనుకున్నారు. కానీ.. ఈ టీజర్ చూస్తుంటే అంతకుమించే ఇందులో ఆసక్తికరమైన అంశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తొలుత ఓ భక్తిరస పాటతో స్టార్ట్ అయ్యే ఈ టీజర్.. ఉన్నట్లుండి ఒక్కసారిగా యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో నాగ్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ బాగా పేలింది. గత భక్తిరస సినిమాల్లోలాగే ఇందులో భక్తిరూపంలో తన విశ్వరూపం చూపించాడు నాగ్. ఒక ఫ్రేమ్‌లో మెరుపుతీగలాగా అలా కనిపించి, ఇలా వెళ్ళిపోయిన ప్రగ్యాజైశ్వాల్ చాలా గ్లామరస్‌గా కనిపించింది. అలాగే.. అనుష్క సన్యాసి గెటప్‌లో ఓ భజన పాట పాడుతూ కనిపించింది. జగపతిబాబు కూడా కోపంతో రగిలిపోతూ ఒక ఫ్రేమ్‌లో కనిపించాడు. ఇక వెంకటేశ్వరుని పాత్ర పోషిస్తున్న సౌరభ్ జైన్ స్ర్కీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది.
టెక్నికల్ పరంగా చూస్తే.. దర్శకేంద్రుడి టేకింగ్ ఎప్పటిలాగే అదిరింది. గత భక్తిరస సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాని మరింత కలర్‌ఫుల్‌గా, ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. గ్రాఫిక్ షాట్స్ మరీమరీ చూడాలనిపించేతగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఓవరాల్‌గా.. భక్తిరసంతో చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.
https://youtu.be/-2kq_mlAL5g