Finally, NTR’s 28 project confirmed under Trivikram Srinivas directions. Haarika & Hassine creations banner has officially announced this statement. From September this movie will go on floors.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ సినిమా ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు టాలెంటెడ్ వ్యక్తులు కలిసి సినిమా తీస్తే.. రిజల్ట్ ఓ రేంజులో ఉంటుందనే ఉద్దేశంతో, వారి కాంబో సెట్ అవ్వాలని చాలాకాలం నుంచి ఆకాంక్షిస్తున్నారు. చివరికి.. వారి కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీతో చేస్తున్న ప్రాజెక్ట్ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత 2017 సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబో సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తన స్టైల్లోనే కమర్షియల్‌గా తెరకెక్కించనున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో చాలా లాజిక్స్ ఉంటాయి కాబట్టి.. ఈ సినిమా ఊహించని రీతిలో ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకి తమిళ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. ఇక హీరోయిన్, ఇతర తారాగణంతోపాటు టెక్నీషియన్స్ వివరాలను జూలైలో నిర్వహించే ప్రారంభోత్సవ సందర్భంగా అఫీషియల్‌గా వెల్లడించనున్నారని తెలిసింది.