షాక్: ఎన్టీఆర్-బాబీ ప్రాజెక్టుకి కొరటాల శివ రిపేర్లు..!

ntr-bobby-koratatala-siva

A shocking news revealed about NTR-Bobby Project. A star director has given suggestion to ntr to do movie with bobby after listening his script and also do some changes.

‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎందరో డైరెక్టర్స్‌ని రిజెక్ట్ చేసి.. చివరికి బాబీని ఎంపిక చేసుకున్నాడు తారక్. ఈ విషయం తెలియగానే.. ప్రతిఒక్కరు ఖంగుతిన్నారు. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ దర్శకులు ఉండగా.. బాబీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడనే సందేహాలు వ్యక్తం చేశారు. బహుశా దీనివెనుక ఏదో తతంగం నడిచి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా సమాచారాన్ని బట్టి చూస్తుంటే.. ఆ అనుమానం నిజమేనని తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం.. బాబీ కథ చెప్పాక తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ కథ నచ్చినప్పటికీ.. ఓకే చెప్పాలా? వద్దా? అని ఆలోచించాడట. ఈ క్రమంలోనే అతను స్టార్ దర్శకుడు కొరటాల శివ సహకారం తీసుకున్నాడట. తనకు ‘జనతా గ్యారేజ్’లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించాడు కాబట్టి.. కొరటాల నుంచి ఓ సలహా తీసుకుంటే బాగుంటుందని తారక్ భావించి అతడ్ని సంప్రదించాడట. వెంటనే రంగంలోకి దిగిన కొరటాల.. బాబీ చెప్పిన కథ విని బాగుందని, అతనితో సినిమా చేయమని సూచించాడట. అయితే.. స్టోరీలో కొద్దిగా మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పి, అక్కడక్కడ ఛేంజెస్ చేశాడట. ఇలా కొరటాల సహకారం అందించడంతో.. ఈ కథతోనే బాబీ దర్శకత్వంలో సెట్స్ మీదకి వెళ్ళాలని తారక్ నిర్ణయించుకున్నాడట. ఇదీ.. అసలు సంగతి.

Leave a comment