కథకి తగ్గట్టు.. ఎన్టీఆర్-బాబీ సినిమాకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ !

NTR bobby movie title trimurthulu kalyan ram

NTR-Bobby movie unit thinking to put title as Trimurthulu which is apt to story. Very soon unit will announce official statement on this news.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఈమధ్యే ఇందులో తారక్ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడని, ఆయా క్యారెక్టర్లకు తగిన ముగ్గురు హీరోయిన్లను కూడా ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది. ఈ వార్తల్లో నిజమా కాదా? అని ఆరాతీయగా.. వాస్తవమేనని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందింది. ఇక తాజాగా ఈ మూవీకి ఓ ఆసక్తికరమైన టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి ‘త్రిమూర్తులు’ అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో తారక్ మూడు పాత్రలు పోషిస్తుండడంతో.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ టైటిల్ ఫిక్స్ చేయనున్నారని చెబుతున్నారు. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొన్నిరోజుల కిందట ఈ చిత్రానికి ‘నట విశ్వరూపం’ అనే టైటిల్ చిత్రబృందం నిర్ణయించిందని టాక్ రాగా.. అవన్నీ రూమర్లేనని నిర్మాత కళ్యాణ్ రామ్ ఖండించిన విషయం తెలిసిందే. మరి.. ‘త్రిమూర్తులు’ టైటిల్ పెడుతున్నట్లుగా వస్తున్న రూమర్లపై కళ్యాణ్ స్పందన ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఆ పనుల్ని ఫినిష్ చేసుకుని.. జనవరి 20వ తేదీ నుంచి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందనుంది.

Leave a comment