ఎన్టీఆర్-బాబీ మూవీకి అదిరిపోయే టైటిల్.. వింటే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే!

ntr bobby movie title natavishwaroopam kalyan ram

NTR 27th project under Bobby direction is titled as Natavishwaroopam. Kalyan Ram producing this movie under NTR arts banner. In this movie Kajal Agarwal, Niveda Thomas and Anupama playing lead role opposite to Tarak.

ఎన్టీఆర్-బాబీ కాంబో సినిమా చకచకా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇప్పటికే హీరోయిన్లతోపాటు ప్రముఖ తారాగణాన్ని ఎంచుకున్న ఈ చిత్రబృందం.. ఇప్పుడు టైటిల్‌గా ఓ పేరు పెట్టాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ ఆలోచిస్తోందట. ఈ మూవీ కథకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో.. ఆ పేరే పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’పై నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ త్రిపాత్రాభినయం పోషిస్తున్నాడు. అతని సరసన కాజల్ అగర్వాల్, నివేద థామస్, అనుపమలు కథానాయికలుగా నటించనున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే నెలలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా చిత్రీకరణని శరవేగంగా ముగించి.. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Leave a comment