ఎన్టీఆర్-బాబీ ప్రాజెక్టులో మరో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే!

ntr bobby kalyan ram project new twist fourth heoine

Another Shocking news going viral on Young tiger NTR and director Bobby combo project which is producing by Kalyan Ram under NTR Arts banner. Read below article to know about that news.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోందన్న అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచి.. ఆ ప్రాజెక్టుకి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో తారక్ త్రిపాత్రాభియనంలో నటిస్తున్నాడని, ఒక్కో రోల్‌కి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం అందింది. ఆ ముగ్గురిలో ఒకరు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాగా.. మరో ఇద్దరు అప్‌కమింగ్ కథానాయికలైన నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్‌లు అని తెలిసింది. ఇప్పుడు ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

అయితే.. ఆ నాలుగో కథానాయికది ఫుల్ లెంగ్త్ రోల్ కాదులెండి. కేవలం ఐటెం సాంగ్ కోసమే ఓ భామని తీసుకోవాలని యూనిట్ ప్లాన్ చేస్తోందట. ‘జనతా గ్యారేజ్’ తరహాలోనే ఇందులోనూ ఓ స్టార్ హీరోయిన్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని దర్శకుడు బాబీ చెప్పాడట. ఇందుకు నిర్మాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఈ లెక్కన.. ఈ సినిమాలో మొత్తం నలుగులు హీరోయిన్లు దర్శనమివ్వనున్నారమాట. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాల్ని శరవేగంగా ముగించుకుని.. వచ్చే నెలలో సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్లాని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడని వినికిడి.

Leave a comment