Finally, Nayanatara caught redhanded being in relationship with director Vignesh Shivan with whom she is dating from long time.
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నయనతార.. ఎప్పుడు ఏదో ఓ ఎఫైర్‌తో వార్తల్లోకెక్కుతుంటుంది. గతంలో శింభు, ప్రభుదేవాలతో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ చెప్పేసి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకి ఓ యంగ్ దర్శకుడు పరిచయమయ్యాడు. అతడే విఘ్నేష్ శివన్. ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా సమయంలో కలుసుకున్న వీళ్ళిద్దరూ.. అప్పటినుంచి రహస్యంగా డేటింగ్ చేస్తూ వస్తున్నారు.
ఈ వార్తల్ని నిజం చేస్తూ చాలా సందర్భాల్లో ఇద్దరూ ఏకాంతంగా కెమెరాకి చిక్కారు. అంతేకాదు.. ఏ ఈవెంట్‌కైనా జంటగానే విచ్చేశారు. ఇప్పుడైతే హద్దులే దాటేశారు. ఏకంగా సహజీవనం చేస్తున్నారు. అవును.. గతకొంతకాలం నుంచి ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. చెన్నైలోని విలాసవంతమైన భవనంలో విఘ్నేష్‌తో కలిసి నయనతార ఉంటోంది. ఈ వార్తల్ని నిజం చేస్తూ తాజాగా మరోసారి జంటగా కెమెరాకంట పడ్డారు. జయలలిత పార్థివదేహాన్ని దర్శించడానికి వీళ్ళద్దరూ జంటగానే వచ్చారు. దీంతో.. వీళ్ళు సహజీవనం చేస్తున్న విషయం నిజమేనని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.