Item bomb Mumaith Khan tweeted about Sampoornesh babu and gave his a comedy super star title who makes her laugh during aneurysm coiling days.
‘హృదయ కాలేయం’ ట్రైలర్ ద్వారా రాత్రికిరాత్రే స్టార్ అయిపోయిన సంపూర్ణేష్ బాబుకి అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. వరుస సినిమాలు చేస్తూ కడుపుబ్బా నవ్విస్తుండడంతో.. ఇతని అభిమానుల సంఖ్య మరింత పెరుగుతోంది. వారిలో తాను కూడా ఉన్నానంటూ ట్విటర్ సాక్షిగా ముమైత్ ఖాన్ వెల్లడించింది. సంపూకి తాను వీరాభిమానని అంటూనే.. తన దృష్టిలో అతనొక సూపర్‌స్టార్ అని కూడా కితాబిచ్చింది. ఇదేదో ఆమె కామెడీగా చెప్పలేదు.. నిజంగానే తాను అతనికి పెద్ద ఫ్యాన్ అని ముమైత్ తెలిపింది.
‘సంపూర్ణేష్.. నా దృష్టిలో నువ్వొక సూపర్ స్టార్.. యూట్యూబ్‌లో నీ వీడియోలు చూశాను.. ప్రతి ఇంటర్నేషనల్ యూట్యూబ్ వ్యూవర్ నీ గురించి, నీ కామెడీ సీన్ల గురించి మంచి రివ్యూలు ఇస్తుంటారు. అనారోగ్యంతో ఉన్నపుడు ఆ నీరసం నుంచి కోలుకోవడానికి నీ కామెడీతో నవ్విస్తూ నాకెంతో సాయం చేశావు.. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ కామెడీతో మమ్మల్ని సంతోషపరుస్తున్నందుకు చాలా థ్యాంక్స్.. లవ్ యూ సంపూ’ అంటూ గురువారం జెమినీ టీవీ అవార్డుల కార్యక్రమానికి సంపూతోపాటు హాజరైన అనంతరం ట్విట్టర్లో ముమైత్ స్పందించింది. అంతకు ముందుకూడా.. సంపూని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ఎగ్జైట్మెంట్తో కూడిన ట్వీట్‌ని కూడా ముమైత్ పోస్ట్ చేసింది.
ఈ విధంగా ముమైత్ తన మీద అభిమానం చూపించడంతో సంపూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘మీరిచ్చిన కాంప్లిమెంట్స్‌కి నోటవెంట మాటలు రావట్లేదు’అని ఎగ్జైట్మెంట్తో కూడిన ఎమోజీస్‌తో ట్వీట్ చేశాడు సంపూర్ణేష్.
@sampoornesh Ur my superstar I’ve watched u so much on YouTube and every international YouTubers give reviews on ur comedy scenes.???
— Mumait Khan™®© (@mumait) December 22, 2016
@sampoornesh U helped me a lot in recovering faster during my aneurysm coiling by making me laugh on ur comedy scenes. I m so happy to meet u ???
— Mumait Khan™®© (@mumait) December 22, 2016
@sampoornesh Can’t wait to see u tonight for Gemini awards. Ur best comedy star in my eyes. Thank u for making us happy with ur comedy. Love ya!! ??
— Mumait Khan™®© (@mumait) December 22, 2016
Naa abhimana taara @mumait khan tho pic.twitter.com/ykiEoqjBu2
— Sampoornesh Babu (@sampoornesh) December 22, 2016
Thank you..U made my day…. i cant express in words right now..pleasure is mine @mumait garu…? https://t.co/NbUZECGA71
— Sampoornesh Babu (@sampoornesh) December 22, 2016
@sampoornesh Mwahhh!!! ???????
— Mumait Khan™®© (@mumait) December 22, 2016