Malayalam superstar Mohanlal starrer “Manyam Puli” movie has eared very well at the domestic boxoffice of Telugu states in it’s first weekend run. According to the trade report, it has collected more than first day because of positive talk from all over.
మలయాళంలో చరిత్ర సృష్టించిన ‘పులిమురుగన్’ సినిమాని తెలుగులో ‘మన్యంపులి’గా డబ్ చేసి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’ల ద్వారా సూపర్‌స్టార్ మోహన్‌లాల్ తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరవ్వడం, పైగా ఇందులో జగపతిబాబు విలన్‌గా నటించడం, మలయాళంలో తిరుగులేని విజయం సాధించడంతో.. టాలీవుడ్‌లోనూ మంచి హిట్ అవుతుందని భావించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆ అంచనాల్ని అందుకోవడంలో ఈ చిత్రం సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.
తొలిరోజు అంతంత మాత్రమే వసూళ్లు వచ్చినా.. పాజిటివ్ టాక్ కారణంగా రెండోరోజు నుంచి ఈ చిత్రం పుంజుకుంది. మూడోరోజు కూడా అదే దూకుడుని కొనసాగించింది. దీంతో.. ఈ చిత్రం సంతృప్తికరమైన వసూళ్లే రాబడుతోందని డిస్ట్రిబ్యూటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ.1.50 కోట్లు (షేర్) కలెక్ట్ చేసింది. రోజులవారీగా చూసుకుంటే.. తొలిరోజు రూ.30 లక్షలు రాగా, మిగిలి రెండురోజుల్లో రూ.1.20 కోట్లు రాబట్టిందని ట్రేడ్ లెక్కలు పేర్కొంటున్నాయి.
ఫస్ట్ షో నుంచి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడం వల్లే ఈ చిత్రం రెండోరోజు నుంచి ఊపందుకుందని అంటున్నారు. టోటల్ రన్‌టైంలో ఈ చిత్రం రూ.4-5 కోట్ల మధ్యే షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏరియాలవారీగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (లక్షల్లో) :
నైజాం : 72
సీడెడ్ : 16
ఈస్ట్ : 10
వెస్ట్ : 9
ఉత్తరాంధ్ర : 14
గుంటూరు : 12
కృష్ణా : 13
నెల్లూరు : 4
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 1.50 కోట్లు (షేర్)