ఖైదీ పాటలకు డేట్ ఫిక్స్ చేసిన మెగాస్టార్!

khaidi no 150 audio release

Megastar Chiranjeevi’s prestigious 150th movie ‘Khaidi No 150’ is getting ready for a Pongal release. The shooting of the movie is in final stage and the audio launch date has been fixed for the movie.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం సంక్రాంతి కానుకగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మెగాస్టార్ దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ‘ఖైదీ నెంబర్ 150’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ టాలీవుడ్‌లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌ కూడా స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. ఖైదీ నెంబర్ 150వ చిత్రంపై అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు రామ్ చరణ్ ధృవ సినిమా విడుదల.. అంతకంటే ముందురోజే టీజర్ విడదుల కలగలిసి మొత్తంగా మెగా ఫ్యాన్స్‌కు ఎక్కడలేని సంతోషాన్ని తెచ్చిపెడుతోంది.

ఇక తాజాగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పారు రామ్ చరణ్ అండ్ కో. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియోను అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆడియో లాంఛ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రీలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో వేడుకను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఆడియో వేడుకకు టాలీవుడ్‌కు సంబంధించిన ప్రముఖులు చాలా మంది హాజరు కానున్నట్ల తెలుస్తోంది. ఇక మెగా ఫ్యాన్స్‌కు ఈ నెల మొత్తం డబుల్ ధమాకా అనే చెప్పాలి.

Leave a comment