Gautamiputra Satakarni latest dialogues which are going viral on online. These dialogues hikes the expectations on movie than before.
బాలయ్య సినిమాల్లో అదిరిపోయే డైలాగ్స్ కంపల్సరీ ఉండాల్సిందే. ఏ సినిమా అయినా తీసుకోండి.. అందులోని డైలాగ్స్ ఆయనకోసమే ప్రత్యేకంగా పుట్టాయేమో అనేంతలా ఉంటాయి. పైగా.. వాటిని బాలయ్య డెలివరీ చేసే విధానం కూడా అమోఘం. ఒక్క మాటలో చెప్పాలంటే.. డైలాగ్స్ చెప్పడంలో బాలయ్య తరువాతే ఎవరైనా. అందుకే.. దర్శకనిర్మాతలు ఎంతో జాగ్రత్తగా రైటర్లతో డైలాగ్స్ రాయించుకుంటారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా విషయంలోనూ క్రిష్ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు.
క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల చివరిరాజు శాతకర్ణి నిజజీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రంలో.. ఆనాటి చరిత్రను తలపించేలా, శాతకర్ణి రాజసం ఉట్టిపడేలా బాలయ్యతో డైలాగులు చెప్పించాలని ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రాని రంగంలోకి దించాడు. తాను ఏ విధంగా అయితే డైలాగులు కోరాడో.. అలాంటి బ్రహ్మాండమైన మాటల్నే ఆయనచేత రాయించాడు క్రిష్. ఆ డైలాగులు వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వాటిని బాలయ్య థియేటర్లో చెబుతున్నప్పుడు.. ఆడియెన్స్ పూనకంతో ఊగిపోవడం ఖాయం. ఆ డైలాగ్స్ కొన్ని మీకోసం..
1) మా జైత్రయాత్రని గౌరవించి..మా ఏలుబడిని అంగీకరించి.. మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాదీనం చేసి.. మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా..
2) మీరు కడుపున మోసింది మనిషిని కాదు.. మారణహోమాన్ని.. మహాయుద్దాన్ని
3) ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం.. ఇక ఉనికి చాటుకుందాం.. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తురితో ప్రక్షాలన చేద్దాం.. దొరికిన వాన్ని తురుముదాం.. దొరకని వాన్ని తరుముదాం.. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం
4) నా బిడ్డ కోసమో.. నీ గడ్డ కోసమో.. కాదు నేను పోరాడుతున్నది.. ఈ దేశం అంతటిని ఏక ఖండంగా కలపడానికి
5) అవును నాకు ఆ గర్వం కావాలి.. ఆ సేతు శీతాచలం ఈ మహాభారత దేశం ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా చూస్తుండే గర్వం కావాలి నాకు..
అలా చూడటానికి వాళ్ళందరిని కాపు కాసేందుకు జీవించే గర్వం కావాలి నాకు
6) వెళ్ళి ఈ ప్రపంచానికి నా మాటగా చెప్పు.. భారతదేశం ఉమ్మడి కుటుంబం.. గదికి గదికి మద్యన గోడలుంటాయి.. గొడవలుంటాయి.. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం.. కానీ పరాయి దేశస్థుడు ఎవడో వచ్చి ఆక్రమించాలి అని ప్రయత్నిస్తే.. ఎగరేసి నరుకుతాం.. సరిహద్దుల్లో మీకు స్మశానాలు నిర్మిస్తాం.. మీ మొండేలమీద మా జెండాలెగరెస్తాం