carrie fisher drowned in moonlight strangled by my own bra.
అదేంటి.. ఓ మనిషి నిండు ప్రాణాల్ని ‘బ్రా’ ఎలా బలిగొంది? అదెలా సాధ్యం? ఇంతకీ ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయా..? వాటన్నింటికి సమాధానం కావాలంటే.. మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.
‘స్టార్ వార్స్’ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఓ పని నిమిత్తం ఆమె లండన్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆమె గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమెను దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8:55 నిమిషాలకు క్యారీ తుదిశ్వాస విడిచింది. అయితే.. 2008లో తాను రాసుకున్న ఆత్మకథ ‘విష్ ఫుల్ డ్రింకింగ్’లో తను చనిపోయిన తర్వాత శ్రద్దాంజలి ఘటించేటపుడు ‘వెన్నెల్లో మునిగి , బ్రా బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది’ అని రాయాల్సిందిగా కోరుకుంది. అలా ఎందుకు చేయమందో ఆ ఆత్మకథలోనే వివరణ కూడా ఇచ్చింది.
1977లో ‘స్టార్ వార్’ సినిమా చేసేటపుడు తనకు, డైరెక్టర్ జార్జ్ లుకాస్‌కి మధ్య ‘బ్రా’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన సంభాషణ జరిగిందట. ఆ సినిమా కోసం దర్శకుడు తనకు అంతరిక్షంలో వేసుకునే దుస్తులు అందజేస్తూ.. ‘ఇవి వేసుకునేటపుడు ‘బ్రా’ ఏమి వేసుకోకూడదు. స్పేస్ సూట్ వేసుకునే వ్యోమగాములు కూడా లోదుస్తులు ధరించరు. ఎందుకంటే.. అంతరిక్షంలోకి వెళ్లాక శరీర బరువు తేలికైపోతుంది. అప్పుడు శరీరం ఉబ్బిపోవచ్చు కానీ బ్రా సైజు పెరగదు’ అని వివరించాడట.
ఆ విషయాన్ని తాను చాలాసార్లు తన స్నేహితులతో చర్చించానని.. అలాగే తాను ఎలా చనిపోయినా ‘వెన్నెల వెలుగులో మునిగి, బ్రా బిగుసుకుపోయి ఊపిరాగిపోయింది’ అని తన శ్రద్ధాంజలిపై రాయాల్సిందిగా సరదాగా మాట్లాడినట్లు క్యారీ తన ఆత్మకథలో పేర్కొంది. ఇప్పుడామె మృతిచెందడంతో.. అందరూ ఆమెకి తమ నివాళులు అర్పిస్తూ.. తన ఆత్మకథలో రాసుకున్న ఆ విషయం గురించి ప్రస్తావించుకుంటున్నారు.