When a movie released in both Tamil and Telugu languages at the same time, obviously the original version will collect more collections. But, Vijay Antony latest film has got opposite reports. Telugu dubbing version of Saithan which is titled as Bethaludu has collected more collections that original version at the USA boxoffice.
విజయ్ ఆంటోనీ తన లేటెస్ట్ సినిమాని అటు ‘సైతాన్’గానూ, ఇటు ‘బేతాళుడు’గానూ రిలీజ్ చేశాడు. ఫస్ట్‌లుక్ నుంచి చిత్రంపై క్రేజ్ పెంచుకుంటూ వచ్చిన ఈ హీరో.. ట్రైలర్‌తో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెంచేశాడు. ఆల్రెడీ ‘పిచ్చైకారన్’ (బిచ్చగాడు)తో సంచలన విజయం సాధించిన తర్వాత విజయ్ నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం కావడంతో.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఫస్ట్ షో నుంచి రిపోర్ట్స్ బాగానే రావడంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. కోలీవుడ్‌కి సమానంగా టాలీవుడ్‌లోనూ ఊహించని కలెక్షన్స్ సాధిస్తోంది.
అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. యూఎస్‌ఏలో ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగులోనే అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. అవును.. మీరు చదువుతోంది నిజమే. సాధారణంగా ఒక సినిమా రెండు భాషల్లో రిలీజైతే.. ఒరిజినల్ వెర్షన్‌కే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. కానీ.. విజయ్ ఆంటోనీ విషయంలో అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. తమిళ్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్‌లోనే రెట్టింపు వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రీమియర్స్ ద్వారా ‘సైతాన్’ $1,421 కలెక్ట్ చేస్తే.. డబ్బింగ్ వెర్షన్ ‘బేతాళుడు’ $3,139 వసూలు చేసింది. ఇదంతా ‘బిచ్చగాడు’ పుణ్యమే అని, ఆ మూవీ భారీ హిట్ అవ్వడంతో విజయ్‌కి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని, అందుకే ‘బేతాళుడు’ అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.