Movies‘బేతాళుడు’నాలుగు రోజుల కలెక్షన్స్.. గట్టెక్కడం కష్టమే!

‘బేతాళుడు’నాలుగు రోజుల కలెక్షన్స్.. గట్టెక్కడం కష్టమే!

Vijay Antony’s “Bethaludu” movie has disappoints Telugu distributors with low collections at the domestic boxoffice of AP and Telangana states. Read below article to know full details..

ఓ సినిమాకి ఎంత ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఫస్ట్ వీకెండ్‌లో సంతృప్తికరమైన కలెక్షన్లు రాబడుతుంది. రిలీజ్‌కి ముందు దానిపై ఏర్పడ్డ క్రేజ్, హీరో ఇమేజ్‌ని బట్టి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి.. తొలి వారాంతంలో టాక్‌తో సంబంధం లేకుండా చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తాయి. తొలిరోజు మంచి వసూళ్లు వస్తే.. మిగిలిన రెండురోజులు డీసెంట్ కలెక్షన్స్ వస్తాయి. గతంలో ఎన్నోసార్లు ఇది ప్రూవ్ అయ్యింది కూడా. కానీ.. ‘బేతాళుడు’ సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా రిజల్ట్ వచ్చింది. తొలిరోజు అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లే వచ్చినా.. ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం దారుణంగా డ్రాప్ అయ్యాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం మొత్తం నాలుగు రోజుల్లో (లాంగ్ వీకెండ్) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి రూ.2.64 కోట్లు కలెక్ట్ చేసింది. రోజులవారీగా చూసుకుంటే.. ఫస్ట్ డే (గురువారం) రూ.1.60 కోట్లు, రెండోరోజు రూ.45 లక్షలు, మూడోరోజు రూ.28 లక్షలు, నాలుగో రోజు రూ.31 లక్షలు రాబట్టింది. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వసూళ్లు ఎంతగా డ్రాప్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఒక్కటే శనివారం కంటే రూ.5 లక్షలు ఎక్కువ కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ రావడం, ‘మన్యంపులి’కి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతుండడం వల్లే.. ‘బేతాళుడు’ వసూళ్లు అంత తక్కువే వచ్చాయని అంటున్నారు.

నిజానికి.. రిలీజ్‌కి ముందు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడంతో రూ.5 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కి చేరుకోవడం చాలా కష్టంగానే ఉంది. వీకెండ్స్‌లోనే తన సత్తా చాటని ఈ చిత్రం.. వీక్ డేస్‌లో ఇంకేం కలెక్షన్లు సాధిస్తుందని అంటున్నారు. పైగా.. ఈ శుక్రవారం ‘ధృవ’ రిలీజ్ కానుండడంతో ‘బేతాళుడు’ని చాలా థియేటర్ల నుంచి తొలగించాల్సి వస్తుంది. అంటే.. ఈసారి ‘బేతాళుడు’ బిచ్చగాడు అయ్యాడన్నమాట.

ఏరియాలవారీగా 4 రోజుల కలెక్షన్స్ (లక్షల్లో) :
నైజాం : 90
సీడెడ్ : 36
గుంటూరు : 33
ఉత్తరాంధ్ర : 30
వెస్ట్ గోదావరి : 16
ఈస్ట్ గోదావరి : 22
కృష్ణా : 24
నెల్లూరు : 13
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 2.64 కోట్లు (షేర్)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news