Nandamuri Balakrishna has given shocking statement which disappoints fans. Read below article to know more details.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అభిమానుల హడావిడి ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రిలీజ్‌కి మూడురోజుల నుంచి వాళ్ల సందడి మొదలైపోతుంది. ముఖ్యంగా.. బెనిఫిట్ షోల కోసం వీళ్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. ఒక్కో టికెట్‌కి భారీ రేటు కేటాయించినా సరే.. చూడడానికి ఎగబడుతుంటారు. బెనిఫిట్ షో చూడడంలో ఉన్న కిక్కే వేరప్పా అంటూ.. లెక్కలేమీ పట్టించుకోకుండా, నిద్రహారాలు మాని మరీ పడిగాపులు కాస్తుంటారు. అలాంటివారికి బాలయ్య కోలుకోలేని షాకిచ్చారు. అసలు బెనిఫిట్ షోస్ వద్దని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు.
అవును మీరు చదువుతోంది నిజమే.. స్వయంగా బాలయ్యనే ఈ ప్రకటన చేశారని సమాచారం. బెనిఫిట్ షోల పేరుతో డిస్ట్రిబ్యూటర్స్ టికెట్‌కి భారీ రేటు కేటాయిస్తున్నారనో లేక అనవసరమైన రచ్చ వద్దనో పక్కాగా తెలీదు కానీ.. ఈ షోస్ వద్దని ఆయన కుండబద్ధలు కొట్టింది వాస్తవేనని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ షోస్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఇది బ్యాడ్ న్యూసేనని చెప్పుకోవచ్చు. కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్‌కి కూడా చాలా నష్టమే. ఈ షోలకి ఒక్కో టికెట్‌కి భారీ రేటు కేటాయిస్తే.. తాము పెట్టిన పెట్టుబడికి తిరిగి వచ్చేయడంతోపాటు భారీ లాభాలు పొందవచ్చు. అలాంటి ఆఫర్ చేజారిపోయింది. ఏదేమైనా.. బాలయ్య ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, బెనిఫిట్ షో వద్దనడానికి ఏదో ఓ బలమైన కారణం ఉండే ఉంటుందని అంటున్నారు.
కాగా.. ఈ సినిమాని తొలుత జనవరి 13వ తేదీన రిలీజ్ చేయాలని యూనిట్ ముందుగా భావించారు. కానీ.. ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకోవాలనే ఉద్దేశంతో లాంగ్ వీకెండ్‌కి ప్లాన్ వేసి, జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి కాబట్టి.. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.