Movies‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీ ప్రీ-రివ్యూ

‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీ ప్రీ-రివ్యూ

Exclusive pre review of Nara Rohith’s latest movie ‘Appatlo Okadundevadu’. In this movie Sri Vishnu played antagonist and Tanya hope as female lead role.

సినిమా : అప్పట్లో ఒకడుండేవాడు
నటీనటులు : నారా రోహిత్, శ్రీవిష్ణు, తన్యా హోప్, రాజీవ్ కనకాల, తదితరులు
దర్శకుడు : సాగర్ కె.చంద్ర
నిర్మాతలు : ప్రశాంతి, కృష్ణ విజయ్
సినిమాటోగ్రఫీ : నవీన్ యాదవ్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : అరన్ మీడియా వర్స్క్

ఈ ఏడాదిలో ఆల్రెడీ ఐదు సినిమాలు రిలీజ్ చేసిన యంగ్ హీరో నారారోహిత్.. ఇప్పుడు ఆరో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత ఐదు చిత్రాల్లో ‘జ్యో అచ్యుతానంద’ ఒక్కటే హిట్ కాగా, మిగిలిన నాలుగు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో.. తన తాజా చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీవిష్ణు, తన్యాహోప్‌లు నటించిన ఈ చిత్రంపై ముందునుంచే మంచి అంచనాలున్నాయి. ట్రైలర్‌కి అనూహ్య స్పందన రావడంతో దీనికి మరింత క్రేజ్ వచ్చిపడింది. మరి.. ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? చూడాలి.

కథ :
శ్రీవిష్ణు.. ఓ కాలేజ్ స్టూడెంట్. సింపుల్‌గా లైఫ్ లీడ్ చేసే ఇతను.. మంచి క్రికెటర్‌గా పేరొందుతాడు. ఇతనికి ఓ ప్రియురాలు కూడా ఉంటుంది. అంతా హ్యాపీగా సాగుతున్న తరుణంలో.. అతని లైఫ్ అనూహ్య మలుపు తిరుగుతుంది. దాంతో.. అతడు క్రిమినల్‌గా మారుతాడు. మారణహోమాలు కూడా చేస్తాడు. ఇతని అరాచకాలు అరికట్టేందుకు పోలీస్ ఆఫీసర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలించవు. అప్పుడు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన నారారోహిత్ ఆ ఏరియాకి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది. మరి.. శ్రీవిష్ణుని రోహిత్ ఎలా పట్టుకుంటాడు? అందుకోసం అతను పన్నే వ్యూహాలేంటి? అసలు శ్రీవిష్ణు ఎందుకు క్రిమినల్‌గా మారుతాడు? చివరికి ఏమవుతుంది? అనే ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.

విశ్లేషణ :
1990లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. దర్శకుడు ఈ సినిమాని మొదటినుంచి చివరి వరకు ఎక్కడ ఫ్లో తగ్గనివ్వకుండా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించాడు. మొదట్లో కాస్త స్లోగా సాగిన.. ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా.. రోహిత్ ఎంటర్ అయ్యాక సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది. శ్రీవిష్ణు, రోహిత్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికే మేజర్ హైలైట్స్. మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా అందరినీ భలే మెస్మరైజ్ చేస్తాయి. సందర్భానుకూలంగా వచ్చే పాటలు ఫర్వాలేదనిపించాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌గా నారారోహిత్ అదరగొట్టాడు. అద్భుతమైన హావభావాలు పలుకుతూ.. ఆడియెన్స్‌ని మెప్పించాడు. శ్రీవిష్ణు ఓ సాధారణ కుర్రాడిగా, క్రిమినల్‌గా మంచి ప్రతిభ కనబరిచాడు. రోహిత్, విష్ణులు పోటాపోటీగా నటించారు. తన్యా హోప్ ఉన్నంతలో బాగానే నటించింది. మిగతా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ పెర్పార్మెన్స్ :
1990కి సంబంధించిన విజువల్స్‌ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన సినిమాటోగ్రఫర్ పనితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మైండ్‌బ్లోయింగ్. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సాగర్ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని వెండితెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఆకట్టుకున్నాయి.

ఫైనల్ వర్డ్ : ఈ చిత్రం ద్వారా ఆడియెన్స్‌ని అలరించి.. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news