Anchor Anasuya romances with husband Sushank Bharadwaj on Dhee jodi dance show.
పెళ్ళయిన సెలబ్రిటీ జంటలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా అరుదు. ముఖ్యంగా.. ఒకరు ఇండస్ట్రీకి చెందినవారై మరొకరు వేరే ప్రొఫెషన్లో ఉంటే మరీ కష్టం. అసలు వాళ్ళు కలిసే జీవనం కొనసాగిస్తున్నారా! అనే అనుమానాలు రేకెత్తేలా వ్యవహరిస్తుంటారు ఈరోజుల్లో. బిజీగా ఉండడం వల్లనో లేక తమకు ఎక్కడ ఆఫర్లు రావనే భయంతోనో తెలీదు కానీ.. చాలామంది భామలు తమ భర్తల గురించి ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు. ఏవో ఈవెంట్లకు కలిసికట్టుగా వస్తారే తప్ప.. సాధారణ సమయాల్లో మాత్రం తమవారి గురించి పల్లెత్తిమాట కూడా చెప్పరు.
కానీ.. హాట్ యాంకర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తాను యాంకర్‌గా నిర్వహించే షోల నుంచి, హోస్ట్‌గా వ్యవహరించే ఈవెంట్లదాకా.. ఎక్కడైనా, ఎప్పుడైనా భర్త ప్రస్తావన వస్తే, తెగ మురిసిపోతూ చెబుతుంటుంది. అందరిలా భయం, బిడియం లేకుండా.. ఓపెన్‌గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. తన కెరీర్‌కి అన్నివిధాలా సపోర్ట్ చేస్తున్నందుకు భర్తకు నిత్యం థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఏకంగా తన భర్త సుశాంక్ భరద్వాజ్‌ని ఓ డ్యాన్సింగ్ షోకి తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. భర్తమీద తనకున్న ప్రేమని కూడా తనదైన శైలిలో చాటుకుంది.
భర్తతో కలిసి డ్యాన్సులు వేయడం, బుగ్గలు పిండడం, ప్రపోజ్ చేయడం, కౌగిలించుకోవడం, చిన్న చిన్న ముద్దులు పెట్టేయడం.. అబ్బో ఓ రేంజ్లో భర్తపై ఉన్న తన ప్రేమని ఈ యాంకరమ్మ చాటిచెప్పిందిలెండి. భర్తల గురించి మాట్లాడానికి ఇతర భామలు జంకుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈ యాంకరమ్మ ఓ షోకి తీసుకొచ్చి, అలా తన ప్రేమిన చాటిచెప్పడంతో అందరూ ఖంగుతిన్నారు.