Amarathi Muralidhar Baba who is called himself as saint is caught red handed in sex scandal.
‘మనోళ్ళకి లాజిక్స్ కంటే మేజిక్ అంటేనే చాలా ఇష్టం.. అందుకే దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఎక్కువ ఉన్నారు’ అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లుగానే దేశవ్యాప్తంగా దొంగబాబాల హవానే నడుస్తోంది. తాము దేవుళ్లమని ఆ బాబాలు చెప్పే అబద్ధం జనాలకు ఎంత తీపిగా అనిపిస్తుందంటే.. ఏకంగా తమ సర్వస్వం ధారబోయడానికి కూడా రెడీ అయిపోతారు. దీన్నే అలుసుగా తీసుకుంటున్న కొంతమంది దొంగబాబాలు.. మహిళలను లొంగదీసుకుంటున్నారు. తమతో పడకగది పంచుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మభ్యపెడుతున్నారు.
ఆల్రెడీ ఆ దొంగబాబాల మాయాజాలంలో పడ్డ మహిళలు.. ఏదో ఆశించి వారితో శృంగార కార్యకలాపాలు కొనసాగించేందుకు కూడా ముందుకొస్తున్నారు. ఇలాంటి బండారాలు ఇప్పటికే ఎన్నో బయటపడ్డాయి. మహిళా భక్తులతో బాబాలు రాసలీలలు నడుపుతున్నారని సాక్ష్యాధారాలతో ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో బాబా అసలు రూపం బయటపడింది. తాను దేవదూత అంటూ ఇన్నాళ్లు భక్తులను మభ్యపెట్టిన అమరావతి మురళీధర్ బాబా.. తన భక్తురాలితో బాత్రూంలో రాసలీలలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పటికే సీసీటీవీ కెమెరాలు బాత్రూంలో అమర్చడంతో.. ఈ విషయం బట్టబయలు అయ్యింది.
తన భక్తురాలిని ఏం చెప్పి మభ్య పెట్టాడో తెలీదు కానీ.. ఆ బాబాతో శృంగారం చేసేందుకు ఆమె బాత్రూంలోకి వచ్చేసింది. అలా ఆమె రావడమే ఆలస్యం.. వెంటనే ఆమెతో రాసలీలలు చేయడం మొదలుపెట్టేశాడు. కేవలం ఒక మహిళతోనే కాదు.. మరో మహిళతో కూడా రొమాన్స్ చేశాడు. గతంలో ఇలాగే ఐదారు మహిళలతో ఈ బాబా వ్యవహరించడంతో.. ఈసారి ఎలాగైనా ఇతని గుట్టు రట్టు చేయాలని భావించి సిసిటీవీ కెమెరాలు అమర్చారు. దాంతో.. అతని యవ్వారం బయటపడింది.
https://youtu.be/OWWH7WBA778