Newsమెగా కుటుంబంలో విషాదం.. శోకసంద్రంలో ఫ్యామిలీ

మెగా కుటుంబంలో విషాదం.. శోకసంద్రంలో ఫ్యామిలీ

Allu Bharathi who is daughter of Allu Ramalingaiah, sister of Allu Aravind and Chiranjeevi wife Surekha sister has died in hospital with health problem.

ఓవైపు రామ్ చరణ్.. మరోవైపు మెగాస్టార్.. ఈ ఇద్దరి స్టార్ల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. తొలుత చరణ్ తన ‘ధృవ’ మూవీతో ప్రక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ మూవీని తారాస్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. నిన్నే (ఆదివారం) భారీఎత్తున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. మెగాఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసమే ఎదురుచూస్తున్న తరుణంలో.. మెగాఫ్యామిలీలో ఘోర విషాదం చోటు చేసుకుంది.

అల్లురామలింగయ్య పెద్దకూతురు, అల్లుఅరవింద్ సోదరి అయిన అల్లుభారతి ఈరోజు (05-12-2016) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో.. మెగాఫ్యామిలీ తీవ్ర మనోవేదకి గురయ్యింది. అల్లు అర్జున్‌కు మేనత్త, చిరు భార్య సురేఖకు అక్క, రామ్ చరణ్‌కి పెద్దమ్మ వరస అయ్యే భారతి.. గతకొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమస్య మరింత తీవ్రం కావడంతో ఆమె తుదిశ్వాస విడిచారని డాక్టర్లు పేర్కొన్నారు. ఈమె మృతితో మెగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం లేదా రేపు జరగనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news