Newsసినిమాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి.. మైనర్‌ని వంచించిన కీచకులు

సినిమాల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి.. మైనర్‌ని వంచించిన కీచకులు

Recently a shocking incident happened in Hyderabad city. 3 guys raped a minor girl when her parents not in home.

సినిమాల్లో రాణించాలనే కోరికతో ఎందరో అమ్మాయిలు అటువైపు అడుగులు వేయడం, కొందరి మాయమాటలు నమ్మి వారి చేతుల్లో బలికావడం లాంటి సంఘటనలు తరుచూ వింటూనే వున్నాం. తాజాగా.. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సినిమాల్లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి.. ఓ మైనర్‌ని ముగ్గురు కీచకులు వంచించారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. చివరికి ఈ వ్యవహారం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ యువకులు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం చాలాకాలం నుంచి హైదరాబాద్‌లో నివాసముంటోంది. వీరికి తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఈ బాలికపై ముగ్గురు యువకులు ఎప్పటినుంచో కన్నేశారు. ఎలాగైనా ఆమెని వంచించాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారికి ఆ బాలిక ‘బలహీనత’ ఒకటి తెలిసింది. ఆమెకి సినిమాలంటే పిచ్చని.. మూవీల్లో నటించాలనే బలమైన కోరిక ఉందని వాళ్లు తెలుసుకున్నారు. దాన్ని ఆసరాగా తీసుకుని.. ఆ బాలికని వశపరచుకోవాలని ఆ ముగ్గురు ఓ పథకం వేశారు. సమయం కోసం కాపుకాస్తూ వచ్చారు. చివరికి వాళ్లకి ఆ సమయం రానే వచ్చింది. వారం రోజుల క్రితం ఆ బాలిక తల్లిదండ్రులు ఓ పని నిమిత్తం బయటకు వెళ్ళారు.

అదే మంచి సమయమని భావించి.. ఆ ముగ్గురు యువకులు బాలిక ఇంట్లోకి వెళ్ళారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మిబలికారు. మాయమాటలు చెబుతూనే.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించారు. ఆ భయంతో బాలిక ఈ అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పుకోలేకపోయింది. కానీ.. ఆమె ముభావంగా ఉండడం గమనించిన తల్లిదండ్రులు.. గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో.. ఆమె పేరెంట్స్ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news